iDreamPost

Radhe Shyam : పాన్ ఇండియా సినిమా తొందరపడాలి

Radhe Shyam : పాన్ ఇండియా సినిమా తొందరపడాలి

సాహో వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటింది. ప్రభాస్ ని మళ్ళీ తెరమీద చూసే అవకాశం రాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటోళ్ళు కనీసం టీవీలోనో ఏదైనా యాప్ ప్రోగ్రాంలోనో కనిపిస్తున్నారు కానీ డార్లింగ్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. ఎంతసేపూ షూటింగులంటూ బిజీగా తిరుగుతున్నాడు తప్ప రిలీజుల గురించి ఏమి చేయలేకపోతున్నాడు. ఇక రాధే శ్యామ్ సంగతి చూస్తే ఇప్పటిదాకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం అనుమానాలను రేకెత్తిస్తున్న మాట వాస్తవం. ఆర్ఆర్ఆర్ చాలా తెలివిగా మార్చి 18, ఏప్రిల్ 28 లాక్ చేసుకోగా కెజిఎఫ్ ఏప్రిల్ 14కి రంగం సిద్ధం చేసుకుంది. వలిమై కూడా రేపో ఎల్లుండో ప్రకటిస్తారు.

ఇంత జరుగుతున్నా రాధే శ్యామ్ టీమ్ మాత్రం సైలెంట్ గానే ఉంది. కొద్దిరోజుల క్రితం మూడు వందల కోట్లకు పైగా డైరెక్ట్ ఓటిటి ఆఫర్ వచ్చిందనే వార్త గట్టిగానే చక్కర్లు కొట్టింది. దర్శకుడు రాధా కృష్ణ ఖండించాడు. యువి సంస్థ మరోసారి థియేట్రికల్ రిలీజ్ ని కన్ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలి ఉంటే బాగుండేది కానీ అలాంటిదేమి జరగలేదు. మొత్తానికి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని మాత్రం అర్థమవుతోంది. లేట్ అయితే ఒక రిస్క్ ఉంది. భీమ్లా నాయక్, ఆచార్య, ఎఫ్3, బీస్ట్, సర్కారు వారి పాట విడుదల తేదీల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీటికి పక్కాగా డేట్లు బ్లాక్ అయిపోతే రాధే శ్యామ్ కు ఆప్షన్లు తగ్గిపోతాయి.

సో నిర్ణయం ఏదైనా వీలైనంత త్వరగా తీసుకుంటే బెటర్. థియేటర్ కి ఓటిటి విండోకి తక్కువ గ్యాప్ ఉండేలా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. కరోనాకు సంబంధించి పరిస్థితులు మెల్లగా చక్కబడుతున్నాయి కానీ థియేటర్లు పూర్తి స్థాయిలో నడిస్తే తప్ప రాధే శ్యామ్ లాంటి సినిమాలకు వర్కౌట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కేసులు కొద్దిగా ఉన్న దశలోనే థియేటర్ల మీద ఆంక్షలు కఠినం చేస్తున్నాయి. ఢిల్లీతో సహా తమిళనాడు తదితర చోట్ల సడలింపులు షురూ అయ్యాయి. సో రాధే శ్యామ్ ఇంకో వారం పది రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయడం బెటర్

Also Read : Etharkum Thuninthavan : కోల్పోయిన వైభవాన్ని ఈటి(ET)నే తేవాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి