iDreamPost

Radhe Shyam : ఊహించని కంటెంట్ తో సిద్ధమవుతున్న ప్రభాస్

Radhe Shyam : ఊహించని కంటెంట్ తో సిద్ధమవుతున్న ప్రభాస్

వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నా హైప్ విషయంలో ఆర్ఆర్ఆర్ కన్నా వెనుకబడే ఉన్న రాధే శ్యామ్ మెల్లగా స్పీడ్ పెంచుతోంది. ఇప్పటిదాకా ఎగ్జైటింగ్ అనిపించే పబ్లిసిటీ ఏదీ జరగకపోవడంతో అసంతృప్తిగా ఉన్న అభిమానుల కోసం ఈ 23న మూడు నిమిషాల ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. స్టన్నింగ్ విజువల్స్ తో అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో దీని ఎడిటింగ్ జరిగిందని ఇన్ సైడ్ రిపోర్ట్. ఇప్పటిదాకా ఎవరూ చూడని ఫీస్ట్ ని డార్లింగ్ ఫ్యాన్స్ అందుకోబోతున్నారని చెబుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జనవరి 14 రాబోతున్న రాధే శ్యామ్ టైం ట్రావెల్ తో పాటు పీరియాడిక్ ఫాంటసీతో రూపొందించారు. భవిష్యత్తుని చెప్పగలిగే హస్తసాముద్రికుడిగా ప్రభాస్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. ఇప్పటిదాకా హిందీ తెలుగులో వచ్చిన లిరికల్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ విపరీతంగా వైరల్ అయ్యే రేంజ్ కు ఇంకా చేరుకోలేదు. నిన్న వదిలిన కృష్ణంరాజు గారి పరమహంస లుక్ కంటెంట్ మీద కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయమనే నమ్మకం యువి నిర్మాతలు వ్యక్తపరుస్తున్నారు. ఇంకో ఇరవై రోజులు ఆగితే చాలు.

ఆర్ఆర్ఆర్ తో మాత్రమే రాధే శ్యామ్ కు గట్టి పోటీ ఉండబోతోంది. కాకపోతే వారం గ్యాప్ ఉంటుంది కాబట్టి వసూళ్ల పరంగా ఇబ్బంది ఉండదు కానీ లాంగ్ రన్, స్క్రీన్ షేరింగ్ లో కొన్ని చిక్కులు రావొచ్చు. భీమ్లా నాయక్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం ఫిక్స్ అయ్యింది. సో ఇంకో ప్రధానమైన అడ్డంకి తొలగిపోయింది. బంగార్రాజు వచ్చినా రాకపోయినా ఇబ్బందేమీ లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ కోసం సౌత్ నార్త్ రెండు భాషలకు వేర్వేరు సంగీత దర్శకులు పని చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సన్నివేశాల పరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయట. నార్త్ ప్రమోషన్లు కూడా ప్లాన్ చేస్తున్నారు

Also Read : Bheemla Nayak : రేస్ నుంచి తప్పుకున్న పవన్ కళ్యాణ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి