iDreamPost

ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారా ఇకపై ఆన్లైన్లోలే ఈ పాస్ లు

ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారా ఇకపై ఆన్లైన్లోలే ఈ పాస్ లు

రాచకొండ పోలీసులు విన్నూత్న ప్రయత్నం

అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వెళ్లాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడినుండి ప్రత్యేకంగా అనుమతి పత్రాన్ని పొంది ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దానితో రోజూ కొందరు ప్రజలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. దాంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ లోనే ఈ పాస్ లు జారీ చేసేలా చూడాలని సీపీ మహేష్ భగత్ ఆదేశాలు జారీ చేయడంతో ఆన్లైన్ లోనే ఈ పాస్ లు జారీ అయ్యేలా కొత్త వెబ్సైట్ ను రూపొందించారు పోలీసులు..

రాచకొండ ఐటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందిన ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌లో దరఖాస్తుదారులు ‘రిక్వెస్ట్‌ ఫర్‌ పాస్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి తమ వివరాలను నమోదుచేయాలి. ఏ కారణంగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారో దానికి రుజువుగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర ఆధారాలను అప్‌లోడ్‌ చేయాలి. వాటిని పరిశీలించిన సిబ్బంది సరైన కారణంతో ఇంటికి వెళ్తున్నారని అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ల ద్వారా తెలుసుకుని ఓ లింక్‌ను దరఖాస్తుదారు మెయిల్‌కు పంపిస్తారు.ఆ లింక్ ను ఓపెన్‌ చేస్తే ఈ-పాస్‌ కనిపిస్తుంది. దాన్ని ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి.

దరఖాస్తుదారు ఈ పాస్ కు అప్లై చేసిన 8 నుంచి 16 గంటల్లో తన మెయిల్‌కే ఈ-పాస్‌లు వస్తాయని రాచకొండ ఐటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. రెండు రకాల(వాహనాలు, వ్యక్తిగత) పాస్‌లూ ఆన్‌లైన్‌లోనే వస్తాయని, రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారికి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా ఇదే విధంగా ఈ పాస్ లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో జారీ చేసే విధానం ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి