iDreamPost

Pushpa OTT : ఓటిటిలో వచ్చినా బన్నీ పరుగు ఆగలేదు

Pushpa OTT : ఓటిటిలో వచ్చినా బన్నీ పరుగు ఆగలేదు

మొన్న అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చాక కూడా పుష్ప పార్ట్ 1 ది రైజ్ బాక్సాఫీస్ రన్ ఇంకా కొనసాగుతోంది. ఓటిటిలో హిందీ వెర్షన్ ఇవ్వకపోవడం నార్త్ సర్కిల్స్ లో బాగా కలిసి వస్తోంది. ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ ని ఒక్క హిందీలోనే దాటేసిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల టార్గెట్ ని పెట్టుకుంది. ఈ సంక్రాంతికి బాలీవుడ్ మూవీ ఏదీ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు దీన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపిస్తున్నారు. మొత్తం ఇరవై మూడు రోజుల రన్ చూసుకుంటే పుష్ప వసూలు చేసిన మొత్తం సుమారు 164 కోట్ల దాకా ఉంది. గ్రాస్ రూపంలో 310 కోట్ల పైమాటే. ఒక్క ఏపిలో కొన్ని ప్రాంతాలు మినహాయించి అన్ని చోట్ల లాభాలు వచ్చినట్టే.

హిందీ డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ దాన్ని యూట్యూబ్ లో పెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే వందల మిలియన్ల వ్యూస్ పోటెత్తడం ఖాయం. కానీ దానికే కట్టుబడతారా లేక ఏదైనా ఒప్పందం చేసుకుని ప్రైమ్ కు ఇస్తారా అనేది వేచి చూడాలి. ఇంకో రెండు వారాలు ఆగాకే నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి బంగార్రాజు ఒకటే స్టార్ హీరో సినిమా. సో అఖండతో తో పాటు పుష్పకి ఇది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఏ మేరకు అనేది ఫైనల్ రన్ అయ్యాక క్లారిటీ వస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల వరకు పుష్ప సుమారుగా 85 కోట్ల షేర్ ని రాబట్టుకుంది. గ్రాస్ రూపంలో 132 కోట్లు.

బ్రేక్ ఈవెన్ దాటేసినా కొన్ని చోట్ల నష్టాలు రావడంతో నిర్మాతలు వాటిని రికవర్ చేసే దిశగా డిస్ట్రిబ్యూటర్లతో పలు అడ్జస్ట్ మెంట్లు చేస్తున్నారని తెలిసింది. కొంత మొత్తాన్ని వెనక్కు ఇవ్వడంతో పాటు సర్కారు వారి పాటకు కొంత మినహాయింపుని హామీ రూపంలో ఇస్తున్నారట. మొత్తానికి ఎలా చూసుకున్నా పుష్ప బ్లాక్ బస్టర్ స్టేటస్ ని అందుకుంది. సుకుమార్ రెండో పార్ట్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ కంతా పూర్తి చేసే లక్ష్యంతో ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. స్క్రిప్ట్ లాక్ అయ్యింది కానీ కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని అంతర్గత వర్గాల సమాచారం

Also Read : Bigg Boss Telugu OTT : పూర్తి భిన్నంగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. ఎప్పటి నుంచి అంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి