iDreamPost

Pushpa 1st Weekend Collections : మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద బన్నీ రచ్చ

Pushpa 1st Weekend Collections :  మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద బన్నీ రచ్చ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ పార్ట్ 1 మొదటి వీకెండ్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవాళ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా తమ వసూళ్లను 173 కోట్లుగా ప్రకటించారు. దీని మీద పలు సందేహాలు వ్యక్తమైనప్పటికీ శుక్రవారంతో మొదలుపెడితే ఆదివారం దాకా పుష్ప మంచి ట్రెండ్ కొనసాగించిన మాట వాస్తవం. ఏపిలో అధిక శాతం ప్రాంతాల్లో టికెట్ల రేట్ల పరిమితులు అమలులో ఉండగా ఇంత కలెక్షన్ సాధ్యమవ్వడం అద్భుతమే. కాకపోతే హిందీ తమిళ మలయాళంలో కూడా పుష్పకు మంచి స్పందన దక్కడం పాజిటివ్ సైన్ గా చెప్పుకోవచ్చు. డివైడ్ టాక్ వచ్చినా బన్నీ ఇమేజ్ జనాన్ని థియేటర్లకు రప్పిస్తోంది.

ట్రేడ్ నుంచి ఒకవర్గం చెబుతున్న రిపోర్ట్ ప్రకారం మొత్తం గ్రాస్ 140 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు. అంటే షేర్ గా చూసుకుంటే 84 కోట్ల దాకా తేలుతుంది. బ్రేక్ ఈవెన్ చేరాలంటే అటుఇటుగా 150 కోట్ల దగ్గరగా వెళ్ళాలి. ఇంకా సగం దూరమే అయ్యింది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఉండటం సహజం. కాకపోతే అది మరీ ఎక్కువగా ఉంటేనే సమస్య. అనూహ్యంగా మూడో వారం పూర్తి చేసుకున్న అఖండ నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు నమోదు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ తదితర నగరాల్లో మల్టీ ప్లెక్సుల్లోనూ టికెట్లు అమ్ముడుపోవడం చూస్తే పుష్ప ప్రభావం మరీ తీవ్రంగా లేదనే విషయం స్పష్టమవుతోంది.

నైజామ్ నుంచి 26 కోట్లు, సీడెడ్ 9 కోట్లు, ఉత్తరాంధ్ర 4.5 కోట్లు, ఈస్ట్ వెస్ట్ కలిపి 6 కోట్ల దాకా, గుంటూరు 3.5 కోట్లు, కృష్ణా 2 కోట్ల 74 లక్షలు, నెల్లూరు 2 కోట్ల దాకా వచ్చినట్టు డిస్ట్రిబ్యూటర్ టాక్. కర్ణాటక 7.5 కోట్లు, తమిళనాడు 5 కోట్ల పైచిలుకు, కేరళ 2 కోట్ల 70 లక్షలు, హిందీలో 6 కోట్లు, ఓవర్సీస్ 8 కోట్ల దాకా వచ్చినట్టు చెబుతున్నారు. కానీ సినిమా బృందం చెబుతున్న లెక్కకు దీనికి వ్యత్యాసం కనిపిస్తోంది కాబట్టి ఇదంతా ధృవీకరించలేం కానీ జనంలో పుష్ప వసూళ్ల గురించి మాత్రం గట్టి చర్చే జరుగుతోంది. ఇంకా సగం పెట్టుబడి దాకా రావాలి కాబట్టి పుష్ప ఇంకో వారం రోజుల పాటు స్ట్రాంగ్ గా ఉండటం చాలా అవసరం. 24న శ్యామ్ సింగ రాయ్ తో పోటీ రాబోతోంది

Also Read : Bigg Boss 5 Winner Sunny : బిగ్‌బాస్‌లో స‌న్నీ విజ‌యానికి కార‌ణాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి