iDreamPost

అప్పటి ‘శివ’ ఫ్రెండే ఇప్పటి ‘పూరి’

అప్పటి ‘శివ’ ఫ్రెండే ఇప్పటి ‘పూరి’

తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మది ఒకరకమైన స్టైల్ అయితే హీరోల మాస్ ఎలివేషన్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన క్రెడిట్ అతని శిష్యుడు పూరి జగన్నాధ్ ది. వీళ్ళిద్దరి గురుశిష్య బంధం ఎంత గట్టిదో అందరికి తెలిసిందే. అయితే ఈ అనుబంధం ఇప్పటిది కాదు. గత 30 ఏళ్ళకు పైగా కొనసాగుతున్నది. దానికి సాక్ష్యంగా ఓ పిక్ పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. 1990లో వచ్చిన శివ హిందీ రీమేక్ లో పూరి హీరో స్నేహితుడి పాత్రలో కనిపిస్తాడు. నూనుగు మీసాలతో యువకుడి ఛాయల్లోకి అడుగు పెట్టిన అమాయకత్వంలో పూరి ఎక్స్ ప్రెషన్స్ వెరైటీగా ఉన్నాయి.

సరిగ్గా చూస్తే పూరి కొడుకు ఆకాష్ పోలికలు సుస్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. హీరో మిత్ర బృందంలో ఒకడిగా పూరి సరిపోతాడని భావించిన వర్మ వెంటనే అమలు జరిపేశాడు. ఈ విధంగా ఓ జ్ఞాపకం పదిలమైపోయిందన్న మాట. ఇప్పుడు వర్మ టోటల్ గా అవుట్ అఫ్ ఫాం అయ్యాడు కాని పూరి ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అవ్వడం చూశాం. గురువుని మించిన శిష్యుడు తరహలో పూరి స్టార్ హీరోలతో ఎన్నో హిట్స్ ఇచ్చాడు.

ఇడియట్, పోకిరి, టెంపర్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో వేగంగా సినిమాలు పూర్తి చేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ జ్ఞాపకాన్ని చూసి ఇద్దరు దర్శకుల అభిమానులు మురిసిపోతున్నారు. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేస్తున్న లైగర్ (రిజిస్టర్ చేసిన టైటిల్) ముంబై షెడ్యూల్ పూర్తి చేసి బ్రేక్ లో ఉన్నాడు. కరోనా హడావిడి తగ్గాక తిరిగి రెజ్యుం చేయబోతున్నారు. దీని తర్వాత పూరి ఇంకెవరికి కమిట్ కాలేదు. మరోవైపు వర్మ దిశ ఘటన ఆధారంగా రూపొందిస్తున్న సినిమా అప్ డేట్స్ బయటికి చెప్పడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నట్టు తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి