iDreamPost

Aadujeevitham: పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’: మలయాళం నుంచి మరో బిగ్ హిట్?

  • Published Mar 14, 2024 | 10:06 PMUpdated Mar 14, 2024 | 10:06 PM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నుంచి మరో ఎగ్జైటింగ్ మూవీ వచ్చేస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే మలయాళం నుంచి మరో షూర్ షాట్ హిట్ కన్ఫర్మ్ అనిపిస్తోంది.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నుంచి మరో ఎగ్జైటింగ్ మూవీ వచ్చేస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే మలయాళం నుంచి మరో షూర్ షాట్ హిట్ కన్ఫర్మ్ అనిపిస్తోంది.

  • Published Mar 14, 2024 | 10:06 PMUpdated Mar 14, 2024 | 10:06 PM
Aadujeevitham: పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’: మలయాళం నుంచి మరో బిగ్ హిట్?

2024 సంవత్సరం మలయాళ సినీ పరిశ్రమకు లక్కీ ఇయర్​గా మారింది. కేవలం రెండు నెలల వ్యవధిలో విడుదలైన ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’. ‘అబ్రహం ఓజ్లర్’, ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘అన్వెషిప్పిన్ కండెతుమ్’ అనే హిట్ చిత్రాలతో ఇతర పరిశ్రమలను మించిపోయి మలయాళ సినిమా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలు అంచనాలకి మించి కలెక్షన్లు వసూలు చేశాయి. ఇందులో అనూహ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న ‘మంజుమ్మెల్ బాయ్స్’ టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది. గత సంవత్సరం విడుదలైన ‘2018’ సినిమాని అధిగమించి మలయాళ పరిశ్రమలో ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది. ఇప్పుడు ఈ హిట్ సినిమాల లిస్ట్​లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం: ది గోట్ లైఫ్’ చేరుతుందా? లేదా? అనేదే ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న.

నిజానికి ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన మోహన్ లాల్ ‘మలైకోట్టై వాలిబన్’ వంటి పెద్ద సినిమా భారీ ఫ్లాప్​గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు మాత్రం పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా సూపర్ హిట్లుగా నిలిచాయి. ‘భ్రమయుగం’లో మమ్ముట్టి వంటి స్టార్ ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్​తో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్​తో కేవలం మూడు పాత్రలతో ఒక ప్రయోగంలా తెరకెక్కిన సినిమా అది. కాస్త గ్యాప్ తర్వాత మలయాళం నుంచి వస్తున్న తదుపరి భారీ చిత్రం ‘ఆడుజీవితం: ది గోట్ లైఫ్’. ఈ ఫిల్మ్ చాలా సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. పృథ్వీరాజ్ కెరీర్​లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. మలయాళం, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మార్చి 28, 2024న థియేటర్లలోకి రాబోతున్న ‘ఆడుజీవితం’ ఎడారి ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొనే ఒక వ్యక్తి కథతో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ట్రైలర్​కు మంచి స్పందన దక్కింది. పృథ్వీరాజ్ కేవలం మలయాళంలోనే గాక ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇటీవల ‘సలార్’లో వరదరాజ మన్నార్​గా అలరించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘ఆడుజీవితం’ సినిమాకి తెలుగు, హిందీ మార్కెట్లలో మంచి క్రేజ్ ఉంది.

సాధారణంగా మలయాళ చిత్రాలు తెలుగు, హిందీ మార్కెట్లలో పెద్దగా ఆడవు. అయితే పృథ్వీరాజ్ స్టార్​డమ్​తో పాటు ప్రస్తుతం మలయాళ సినిమా సక్సెస్ స్ట్రీక్ వల్ల ‘ఆడుజీవితం’ కూడా అదే తరహాలో హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైన చెప్పుకున్న విధంగా ఈ సినిమా ఎన్నో ఏళ్ల పాటు షూటింగ్ స్టేజ్​లో ఉండటం అనేది మాత్రం కాస్త మైనస్​గా మారొచ్చు. మరి.. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘ఆడుజీవితం’ అంచనాలను అందుకొని ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి చిన్న సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే

.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి