iDreamPost

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రెండో కెప్టెన్ గా ప్రిన్స్ యావర్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రెండో కెప్టెన్ గా ప్రిన్స్ యావర్..!

బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ రాగానే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది. అలాగే వీకెండ్స్ లో ఎవరు కెప్టెన్ కాబోతున్నారు అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. తొలివారం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కెప్టెన్ కావడంతో అందరూ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ప్రశాంత్ ఎంతో కష్టపడి కెప్టెన్ అయ్యాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే రెండోవారం ఎవరు కెప్టెన్ అవుతున్నారు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు కెప్టెన్ అయితే ప్రేక్షుకలు ఆనంద పడతారో అతనే ఈ వారం కెప్టెన్ అయ్యాడు అని చెబుతున్నారు. రెండో వారం కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ గెలిచినట్లు లీకులు వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ మొదలుకాక ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా ఈ సీజన్ కి సంబంధించి లీకులు వస్తూనే ఉన్నాయి. అదే పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు కెప్టెన్ అయ్యారు? ఈ వారం హోస్ట్ నాగార్జున ఏ సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నాడు ఇలా ప్రతి విషయాన్ని లీక్ చేసేస్తున్నారు. ఇప్పుడు రెండో వారం కెప్టెన్ ఎవరు అయ్యారు అనే విషయాన్ని కూడా లీక్ చేశారు. వాళ్ల లీకుల ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ విజయం సాధించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం ఆరు ఛాలెంజస్ పెట్టారు.

ఫైనల్ గా ఆటగాళ్ల టీమ్ నుంచి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వారికి బెలూన్ లు కాపాడుకునే టాస్క్ ఇచ్చారంట. దానిలో ఆఖరి రౌండ్ వరకు తేజ, యావర్ చేరుకున్నారు. చివర్లో నయనీ పావనీ యావర్ కు హెల్ప్ చేయడం వల్ల అతను విజయం సాధించినట్లు చెబుతున్నారు. అలా రెండో వారం కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ అవతరించాడు. ఈ విజయం హౌస్ లో ఉన్న వాళ్లకే కాదు.. ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది అని చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో ప్రిన్స్ యావర్ కెప్టెన్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాడు. ఒకసారి కంటెండర్ షిప్ వరకు వెళ్లి హౌస్ మేట్ కాలేక వెనక్కు వచ్చాడు. రెండోసారి కెప్టెన్సీ టాస్కు వరకు వెళ్లి వెనక్కి వచ్చాడు. రెండుసార్లు అవకాశం వచ్చినా కూడా కెప్టెన్ కాలేక పోయాడు. చివరకు రెండోవారం బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా అవతరించి ప్రిన్స్ యావర్ చరిత్ర సృష్టించాడు.

తెలుగు రాదు అనుకున్న యావర్ కు తెలుగు బాగానే వచ్చు అని అందరికీ తెలిసింది. అలాగే హౌస్ లో కూడా తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇంక కెప్టెన్ అయ్యాక కచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాడు అని చెప్పాలి. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే ప్రిన్స్ యావర్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాడు. అలాగే ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నట్లుగా ఫైనలిస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హౌస్ లో యావర్ పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు. తప్పులేనప్పుడు కేకలు వేయడం, లవ్ ట్రాక్ కోసం తాపత్రయ పడటం ఇలా అన్నీ చూస్తే.. ప్రిన్స్ యావర్ కు ఆట మీద స్పష్టమైన అవగాహన ఉంది. మరి.. కెప్టెన్ గా యావర్ ఆకట్టుకుంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి