iDreamPost

ఆంద్రప్రదేశ్ లో రెండవ రోజే జనం లేక వెల వెల బోయిన మద్యం షాపులు.

ఆంద్రప్రదేశ్ లో రెండవ రోజే  జనం లేక వెల వెల బోయిన మద్యం షాపులు.

సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత కేంద్ర ప్రభుత్వo ఇచ్చిన వెసులుబాటు మేరకు నిన్నటి రోజున రాష్ట్రంలో అనుమతించిన జోన్ లలో మధ్యం షాపుల తెరుచుకోవడంతో ఒక్కసారిగా మధ్యం ప్రియులు హల్చల్ చేశారు. విడతల వారీగా రాష్ట్రంలో మధ్యనిషేధం అమలుచేస్తాం అని జగన్ చెప్పిన విధంగానే మధ్యం ధరను సామాన్యులకి షాక్ కొట్టేలా 25% పెంచినా మందుబాబులు లెక్క చేయకుండా మద్యం కొనడానికి ఎగబడ్డారు. దీంతో రాష్ట్రంలో అనేక చోట్ల మందు కోసం మందుబాబులు మద్యం దుకాణాల దగ్గర కిలో మీట్లర లెక్కన బారులు తీరిన సన్నివేశాలు కనిపించాయి.

అయితే నిన్న రద్దీగా కనిపించిన మద్యం దుకానాలు ఈ రోజున ఖాళీగా మారిపోయిన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపించాయి. నిన్నటి రోజున మద్యం దుకాణాల దగ్గర వందల సంఖ్యలో కనిపించిన మద్యం ప్రియులు నేడు పదుల సంఖ్యలో దర్శనం ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మద్యం దుకాణాలు వెలవెలబోయాయి. అయితే హఠాత్తుగా మారిన ఈ దృశ్యం వెనక ప్రభుత్వం తీసుకున్న మద్యం రేటు పెంపుయే కారణం అని పలువులు మందుబాబులు చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా 50% పెంచి రెండు రోజుల వ్యవదిలో మొత్తం 75% పెంచేసరికి, అలాగే సాదారణంగా దొరికే బ్రాండ్లు మద్యం షాపుల్లో అందుబాటులో లేకపోయేసరికి మందుబాబులు స్వచ్చందగా మద్యం కోసం ఎగబడకుండా ఇంటికే పరిమితమయ్యరని చెబుతున్నారు.

ఏది ఏమైనా జగన్ తొలి రోజు నుంచి చెబుతునట్టు మద్యం రేటును సామాన్యులకు షాక్ కొట్టేలానే పెంచారు. దీంతో పాటు మరో 33% మద్యం దుకాణాలు ప్రభుత్వం తగ్గించబోతునట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపధ్యం లో మద్యం అందుబాటులో ఉన్న దాని రేటు చూసి సామాన్యులు ఆ వైపు చూడటానికే భయపడుతున్నారు . దీంతో జగన్ సర్కార్ దశలవారి మద్యనిషేదం వైపు వేస్తున్న అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి