iDreamPost

‘ప్రేమలు’ తెలుగు వెర్షన్​ క్రేజీ అప్​డేట్.. మాటలు అందించనున్న స్టార్ డైరెక్టర్!

  • Published Feb 29, 2024 | 8:42 PMUpdated Feb 29, 2024 | 8:42 PM

మలయాళ రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘ప్రేమలు’ తెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగు వెర్షన్​ నుంచి క్రేజీ అప్​డేట్ బయటకు వచ్చింది.

మలయాళ రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘ప్రేమలు’ తెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగు వెర్షన్​ నుంచి క్రేజీ అప్​డేట్ బయటకు వచ్చింది.

  • Published Feb 29, 2024 | 8:42 PMUpdated Feb 29, 2024 | 8:42 PM
‘ప్రేమలు’ తెలుగు వెర్షన్​ క్రేజీ అప్​డేట్.. మాటలు అందించనున్న స్టార్ డైరెక్టర్!

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కొత్తదనంతో కూడిన కథలు, ప్రయోగాత్మక చిత్రాలు, సెన్సిటివ్ సబ్జెక్స్ట్​తో అక్కడ ఎక్కువగా మూవీస్ తెరకెక్కుతుంటాయి. మలయాళ సినిమాల మజా ఏంటో కరోనా టైమ్​లో అందరికీ తెలిసొచ్చింది. ఆ టైమ్​లో ఓటీటీలకు బాగా అలవాటు పడిన ఆడియెన్స్.. కేరళ చిత్రాలను ఎక్కువగా చూశారు. ఏ కథాంశం ఎంచుకున్నా డిఫరెంట్​గా ప్రెజెంట్ చేయడం వాళ్ల స్టైల్. చిన్న పాయింట్​ను తీసుకొని స్టోరీని అందంగా అల్లుకోవడం, రాసిన కథను అంతే డేర్​గా, దాని బ్యూటీ చెడకుండా తీయడం అక్కడి మేకర్స్​కు అలవాటుగా మారింది. అందుకే మలయాళ చిత్రాలకు ఇప్పుడు అందరూ అడిక్ట్ అయిపోయారు. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘ప్రేమలు’ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రూ.3 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ‘ప్రేమలు’ మూవీ ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసులు చేసి సూపర్​డూపర్ హిట్​గా నిలిచింది. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్​ కోసం ఇక్కడి ఆడియెన్స్ ఈగర్​గా ఎదురు చూస్తున్నారు. ‘ప్రేమలు’ చిత్రం తెలుగులోకి డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఫిల్మ్ రైట్స్​ను ఎస్ఎస్ కార్తికేయ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు’ డబ్బింగ్ వెర్షన్​ నుంచి ఓ క్రేజీ అప్​డేట్ వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్​కు ఓ స్టార్ డైరెక్టర్ మాటలు అందిస్తున్నారని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘90s’ వెబ్ సిరీస్​తో ఓవర్​నైట్ పాపులర్ అయిన ఆదిత్య హాసన్ అని టాక్.

‘ప్రేమలు’ తెలుగు వెర్షన్​కు ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మాటలు రాసేశారని.. డబ్బింగ్ పనులు జోరుగా జరుగుతున్నాయని సమాచారం. త్వరలో మిగిలిన పనులన్నీ పూర్తి చేసి మార్చి 8వ తేదీన భారీ స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మంచి హ్యూమర్​తో డైలాగ్స్ రాయడంలో ఆదిత్య హాసన్ ఆరితేరారని.. దీనికి ‘90s’ సిరీస్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఇక, ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని హాట్​స్టార్ దక్కించుకుందని సమాచారం. గిరీష్ డైరెక్షన్​లో రూపొందిన ‘ప్రేమలు’లో నస్లేన్, మమిత, అల్తాఫ్ సలీమ్, మీనాక్ష్మీ రవీంద్రన్, అఖిల భార్గవ్ కీలక పాత్రలను పోషించారు. మరి.. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్​ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాము కారు నడపడం ఏంటి? వాటే థాట్.. వాటే విజన్.. పిచ్చోళ్లం అయిపోయాం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి