iDreamPost

HanuMan: జై హనుమాన్ స్టోరీ ఇదేనా? ఆ చిరంజీవులు వస్తే మహా యుద్ధమే..

హనుమాన్ సినిమా రికార్డుల వేట ఇంకా ముగియనే లేదు. అప్పుడే జై హనుమాన్ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

హనుమాన్ సినిమా రికార్డుల వేట ఇంకా ముగియనే లేదు. అప్పుడే జై హనుమాన్ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

HanuMan: జై హనుమాన్ స్టోరీ ఇదేనా? ఆ చిరంజీవులు వస్తే మహా యుద్ధమే..

హనుమాన్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ అయ్యి 12 రోజులు కావొస్తున్నా ఇంకా బజ్ మాత్రం అదే స్థాయిలో నడుస్తోంది. సౌత్ లో మాత్రమే కాకుండా.. నార్త్ లో కూడా హనుమాన్ గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ గురించి మాత్రమే కాకుండా జైహనుమాన్ గురించి కూడా పెద్దఎత్తున చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. సినిమా రావడానికి ఇంకో ఏడాదికి పైగా సమయం ఉన్నా కూడా జై హనుమాన్ కథ ఎలా ఉండబోతోందో అని ఇప్పటి నుంచి మాట్లాడేసుకుంటున్నారు. హనుమాన్ సినిమాలో కేవలం ఇద్దరు చిరంజీవుల గురించి మాత్రమే చూపించారు. కానీ, జైహనుమాన్ లో మాత్రం మిగిలిన చిరంజీవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.

పురణాలు, ఇతిహాసాలను బట్టి చూస్తే మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. అయితే హనుమాన్ సినిమాకి సంబంధించి స్క్రీన్ మీద కేవలం ఇద్దరు చిరంజీవులను మాత్రమే చూపించారు. హనుమాన్ మూవీలో మీకు విభీషణుడు, హనుమంతుడిని చూపించారు. ఆ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినందుకే ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. కానీ, జై హనుమాన్ మాత్రం అంతకు మించి ఉంటుందన ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హనుమాన్ క్యారెక్టర్ కోసం స్టార్ హీరోని వెతికే పనిలో కూడా పడ్డాడు. ఇక్కడికే ఈ మూవీపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు జై హనుమాన్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది.

ప్రశాంత్ వర్మ కామెంట్స్ ని డీ కోడ్ చేస్తూ.. జై హనుమాన్ స్టోరీ ఇలా ఉండబోతోందా? అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అవేంటంటే.. ప్రశాంత్ వర్మ తన ఇన్ పుట్స్, రిఫరెన్సులు అన్నీ పురాణాలు, ఇతిహాసాల నుంచే తీసుకుంటానని చెప్తుంటాడు. అయితే పురాణాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. కానీ, హనుమాన్ చిత్రంలో మాత్రం కేవలం ఇద్దరిని మాత్రమే చూపించాడు. నిజానికి ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్ లో మొత్తం 12 మంది సూపర్ హీరోలు ఉన్నారు. అందులో హనుమంతుడు ఒకడు. ఇప్పుడు ఇవే జై హనుమాన్ మీద హైప్ ని పెంచేస్తున్నాయి. కచ్చితంగా కథ పరంగా జై హనుమాన్ నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది. అయితే ఆ పార్టులో మిగిలిన చిరంజీవుల్లో కనీసం ఒకరు ఇద్దరినైనా చూపించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. హనుమంతుడు, విభీషణుడితో కలిసి వాళ్లు కూడా రాక్షసులపై పోరాడే ఛాన్స్ ఉంది. హనుమాన్ సినిమాలో అందుకు తగిన స్కోప్ ని చూపించారు.

మిగిలిన ఐదుగురు చిరంజీవులు పరశురాముడు, అశ్వత్థాముడు, బలి చక్రవర్తి, కృపాచార్యుడు, వేదవ్యాసుడు ఉన్నారు. హనుమాన్ సినిమాలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్పించారు. అసురులు నిద్రలేచారు.. విజృభించబోతున్నారు.. వాళ్లని ఆపాలంటే స్వామి హనుమ నువ్వు రాక తప్పదు అంటూ చెప్తాడు. జై హనుమాన్ లో కచ్చితంగా హనుమ పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. అయితే ఆయనకు మద్దతుగా మిగిలిన చిరంజీవుల్లో ఎవరినైనా తీసుకొస్తారా అనేదే ప్రశ్న. ఇద్దరు ఉంటేనే హనుమాన్ సినిమాకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే ఇంకాఎవరైనా సూపర్ హీరోలు యాడ్ అయితే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఏంటో తెలియాలంటే ఇంకో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందే. మరి.. జై హనుమాన్ సినిమాలో ఇంకా ఎవరైనా సూపర్ హీరోలు ఉంటే బావుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి