iDreamPost

RTC బస్సుల పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. రంగంలోకి సజ్జనార్!

తెలంగాణలో ఆర్టీసీ అభివృద్ధికి విశేషమైన సేవలందించారు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. అయితే ఈ ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా ఫ్యాన్స్ ముసుగులో ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనను ఆయన ఖండిస్తూ.. సీరియస్ అయ్యారు.

తెలంగాణలో ఆర్టీసీ అభివృద్ధికి విశేషమైన సేవలందించారు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. అయితే ఈ ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా ఫ్యాన్స్ ముసుగులో ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనను ఆయన ఖండిస్తూ.. సీరియస్ అయ్యారు.

RTC బస్సుల పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. రంగంలోకి సజ్జనార్!

ఏ సీజన్‌లో లేనంత ఉత్కంఠ, ఇసుక వేస్తే రాలనంత అభిమాన జనం.. హైదరాబాద్‌లో ఈ ఆదివారం (డిసెంబర్ 17) చోటుచేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం ప్రసారమైంది. సామాన్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చే తమ ఫేవరేట్ కంటెస్టెంట్లను చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. బిగ్ బాస్ హౌజ్ నుండి వాళ్లు వచ్చేలోపే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. నానా హంగామా సృష్టించారు. అమర్ దీప్ ఫ్యాన్స్‌తో వాగ్వాదానికి దిగడంతో పాటు బస్సును ధ్వంసం చేశారు. సెలబ్రిటీ కార్లపై దాడి చేశారు. కారులో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా బూతులు తిట్టారు.

ఆదివారం అభిమానం హద్దులు దాటేసింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఫ్యాన్స్ అనే ముసుగులో ఆకతాయిలు అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. దీనిపై సీరియస్ అయ్యారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ విసీ సజ్జనార్. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ‘ బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్‌‌లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఆరు బస్సులపై దాడి చేయడమంటే చిన్న విషయం కాదు. ఇదేం అభిమానం అంటూ ప్రశ్నించారు. అయితే ఈ చర్యలు నిజంగా చాలా మంది సిటిజన్లకు ఇబ్బందిని కలిగించాయి. బస్సులో ప్రజలు ఉన్నారన్న విచక్షణ కూడా మర్చిపోయి ఈ దాటి చేయడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు.

ఫ్యాన్స్ అంటూ వచ్చి.. నానా యాగీ చేసి.. వాగ్వాదానికి దిగి.. ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ప్రజా ధనాన్ని నాశనం చేశారు. ప్రజల జీవితాలను, ప్రభుత్వ ఉద్యోగులను ప్రమాదంలో పడేశారు. తొలి నుండి ఆర్టీసీ లాభాలు పట్టేందుకు విశేష కృషి చేసిన సజ్జనార్.. ఈ దాడులను ఖండించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్లను ఉపేక్షించేది లేదని తెలిపారు. అలాగే నమోదైన కేసును బట్టి.. ఆ ఆకతాయిలు ఎవ్వరనేదానిపై విచారణ ప్రారంభించారు. నిందితులను తర్వలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగడంతో.. ఆర్టీసీకి ఉద్యోగులకు భరోసానిచ్చినట్లయ్యింది. ఆరు బస్సులపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేయడాన్ని ఏమనాలో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి