iDreamPost

PMMY: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం వరం.. తక్కువ వడ్డీకే రూ. 10 లక్షలు లోన్!

చాలా మంది స్వంత కాళ్లపై నిలబడాలని, స్వయం ఉపాధి సృష్టించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

చాలా మంది స్వంత కాళ్లపై నిలబడాలని, స్వయం ఉపాధి సృష్టించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

PMMY:  సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం వరం.. తక్కువ వడ్డీకే రూ. 10 లక్షలు లోన్!

చాలా మంది ఉద్యోగాలు దొరక్క లేదా వచ్చే వేతనంతో ఇల్లు గడపలేక స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తుంటారు. కానీ చిన్న వ్యాపారం చేయాలన్న డబ్బులతో ముడిపడి ఉంటుంది. పెట్టుబడిగా కొంత ఉన్నా.. మిగిలిన ఆస్తులు ఉండే తాకట్టు పెట్టి లేదా అమ్మి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇందులో రిస్క్ ఉందని భావించే వాళ్లు బయట నుండి వడ్డీల రూపంలో కొంత అప్పు చేస్తుంటారు. కానీ వడ్డీ సమయానికి కట్టకపోతే.. వడ్డీపై వడ్డీ అంటే చక్రవడ్డీ వేసి వసూలు చేయడమే కాదు.. పరువు కూడా తీస్తుంటారు. దీంతో చాలా మంది బిజినెస్ చేయాలని ఉన్నా.. సమస్యలు తలచుకుని వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకు వచ్చింది.

అదే ప్రధాన మంత్రి ముద్రా యోజన. సూక్ష్మ, చిన్న, మధ్య, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8, 2015లో ప్రారంభించారు. బిజినెస్ చేయాలన్నా లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తున్న వాళ్లు వీటిలో లోను తీసుకోవచ్చు. అన్ని అర్హతలు ఉండి, సరైన పత్రాలు ఉండి, సరైన ఉద్దేశంతో వ్యాపారం చేయాలనుకుంటే లోన్ రావడం చాలా తేలిక.తక్కువ వడ్డీతో సుమారు రూ. 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఈ ముద్రా లోన్స్ కేవలం ప్రభుత్వ బ్యాంకులే కాదు.. కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మెక్రో ఫైనాన్స్ సంస్థలు సహా వివిధ ఆర్థిక సంస్థల లోన్స్ అందిస్తాయి.

ఇందులో మూడు దశల్లో రుణాలు అందజేస్తారు. తొలుత శిశు రుణం.. ఇందులో రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. తర్వాత కిశోర్ లోన్ కింద రూ. 50 వేల నుండి రూ. 5 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. తరుణ్ లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందుకోవచ్చు. అయితే దరఖాస్తుదారు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్ కాకూడదు,క్రెడిట్ స్కోర్ బాగుండాలి.ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో. పీఎం ముద్ర అధికారిక వెబ్‌సైట్ (https://www.mudra.org.in/)కి వెళ్లి, తర్వాత ఉద్యమమిత్ర పోర్టల్‌ని సెలక్ట్‌ చేసుకోండి. ముద్రా లోన్ కోసం ఆధార్, అడ్రస్, పాస్ట్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లయర్ సంతకం, బిజినెస్ ఎంటర్ ప్రైజ్ అడ్రస్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.

‘అప్లై నౌ’ బటన్‌పై క్లిక్‌ చేయండి.  న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌, ఎస్టాబ్లిష్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌, సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ ప్రొఫెషనల్‌ ఆప్షన్స్‌లో ఒకటి సెలక్ట్‌ చేసుకోండి. దరఖాస్తుదారు పేరు , ఈ మెయిల్, మొబైల్ నంబర్‌ ఎంటర్‌ చేయండి. మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.  ఓటీపీ ఎంటర్‌ చేయండి. దాని ఆధారంగా శిశు, కిశోర్, తరుణ్ అవసరమైన లోన్ టైప్‌ని ఎంచుకోండి. అక్కడ అడిగిన వివరాలు పొందు పర్చాల్సి ఉంటుంది. అక్కడ చెప్పిన ఫ్రూవ్స్ అన్ని అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇక ఆర్బీఐ మార్గదర్శకాల ఆధారంగా, కాలానుగుణంగా వడ్డీరేట్లు వస్తుంటాయి. రుణాలకు ఎంపికైతే.. ప్రాసెసింగ్ చార్జీలు కూడా ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి