iDreamPost

Spirit: ‘యానిమల్’ను మించేలా ‘స్పిరిట్’.. సందీప్​రెడ్డి విజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Published Feb 11, 2024 | 3:03 PMUpdated Feb 11, 2024 | 3:03 PM

‘యానిమల్’తో ఆడియెన్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగా. నెక్స్ట్ రెబల్​ స్టార్ ప్రభాస్​తో తీయనున్న ‘స్పిరిట్’ మూవీ పనుల్లో ఆయన బిజీ అయిపోయారు.

‘యానిమల్’తో ఆడియెన్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగా. నెక్స్ట్ రెబల్​ స్టార్ ప్రభాస్​తో తీయనున్న ‘స్పిరిట్’ మూవీ పనుల్లో ఆయన బిజీ అయిపోయారు.

  • Published Feb 11, 2024 | 3:03 PMUpdated Feb 11, 2024 | 3:03 PM
Spirit: ‘యానిమల్’ను మించేలా ‘స్పిరిట్’.. సందీప్​రెడ్డి విజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

‘యానిమల్’.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన ఈ ఫిల్మ్ రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్​తో బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ చిత్రంతో స్టార్​గా ఉన్న రణ్​బీర్ కపూర్ కాస్తా సూపర్​స్టార్​గా మారారు. ఆయనలోని నటనా పటిమకు, దర్శకుడు సందీప్​రెడ్డి వంగా టేకింగ్, రైటింగ్​కు అందరూ ఫిదా అయ్యారు. ఇండియన్ మూవీస్​లో ఇదో కల్ట్ క్లాసిక్ అని చాలా మంది క్రిటిక్స్ ప్రశంసించారు. ‘యానిమల్​’పై పలు విమర్శలు కూడా వచ్చాయి. కంటెంట్​ను ఇంత బోల్డ్​గా ప్రెజెంట్ చేయడం ఏంటనే కామెంట్స్ వినిపించాయి. అయితే సినిమా సక్సెస్ హవాలో అవన్నీ కొట్టుకుపోయాయి. ‘యానిమల్’ ఇచ్చిన జోష్​తో రెబల్ స్టార్ ప్రభాస్​తో ‘స్పిరిట్’ తీసేందుకు రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగా.

‘స్పిరిట్’ సినిమా విషయంలో వస్తున్న వార్తలు మూవీపై ఎక్స్​పెక్టేషన్స్​ను మరింతగా పెంచేస్తున్నాయి. సందీప్​రెడ్డి వంగా ఈసారి మరింత బోల్డ్​గా, చాలా డార్క్​గా చిత్రాన్ని తీసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. డిఫరెంట్ విజన్​తో మునుపెన్నడూ చూడనటువంటి ఓ కథతో ‘స్పిరిట్​’ను రూపొందిస్తున్నారట సందీప్​రెడ్డి. పిల్లల కోసం కాకుండా.. కేవలం పెద్దలకు మాత్రమే అనేలా మూవీని డిజైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన గత చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్​’లో కొన్ని ఎలిమెంట్స్​ను ఎక్స్​ట్రీమ్​ లెవల్లో ప్రెజెంట్ చేశారు సందీప్​ వంగా. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, విలన్లతో తలపడే ఫైట్ సీక్వెన్సుల్లో ఇది కనిపిస్తుంది. యాక్షన్ సీన్లలో మితిమీరిన హింస ఉండటం వల్ల ‘యానిమల్​’కు ఏ సర్టిఫికేట్ వచ్చింది. వయొలెన్స్​తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా లైన్ దాటడంతో ఆ సినిమాను పెద్దల కోసం మాత్రమే ప్రదర్శించారు.

ఓటీటీలోకి వచ్చాక ‘యానిమల్​’ చిత్రం కిడ్స్​కు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రభాస్​తో తీస్తున్న ‘స్పిరిట్​’ విషయంలోనూ సందీప్​ వంగా తగ్గేదేలే అంటున్నారు. ఈ సారి డార్క్ థీమ్​తో, డిఫరెంట్ విజన్​తో ఆయన తీస్తున్న మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ కంటే ముందే పెద్దలకు మాత్రమే అని ఫిక్స్ అయిపోవాలని సందీప్ వంగా అంటున్నారు. ప్రభాస్ మూవీని రా అండ్ పవర్​ఫుల్ యాక్షన్ ఫిల్మ్​గా తీయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ సినిమా పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్​ను కూడా ఇచ్చేశారు. దీంతో ‘స్పిరిట్​’లో వయొలెన్స్​ను ఎక్స్​ట్రీమ్ లెవల్లో చూపించడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవల్లో ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ప్రభాస్ ‘స్పిరిట్’ ఏ జోనర్​లో ఉండనుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Deepika Padukone: ‘కల్కి 2898 AD’ కోసం దీపికకు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. కెరీర్​లో ఇదే హయ్యెస్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి