iDreamPost

Salaar First Review: ప్రభాస్ ‘సలార్ సినిమా’ ట్విట్టర్ రివ్యూ

Salaar Movie Twitter Review in Telugu: ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సలార్ సినిమాకి సంబంధిచి ఇప్పటికే యూఎస్ రివ్యూలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి.. అసలు సలార్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Salaar Movie Twitter Review in Telugu: ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే సలార్ సినిమాకి సంబంధిచి ఇప్పటికే యూఎస్ రివ్యూలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి.. అసలు సలార్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Salaar First Review: ప్రభాస్ ‘సలార్ సినిమా’ ట్విట్టర్ రివ్యూ

సలార్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్లో రీసౌండింగ్ ఇస్తున్న పేరు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. కాదు.. కాదు.. స్క్రీన్స్ ని తగలబెట్టేస్తోంది. సాధారణంగానే డార్లింగ్ ప్రభాస్ సినిమా అన్నా.. ప్రశాంత్ నీల మూవీ అన్న సినిమా ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి వాళ్లిద్దరు కలిసి చేసిన సినిమా అయ్యే సరికి హైప్ ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది. పైగా రిలీజైన పాటలు, ట్రైలర్స్ అన్నీ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేశాయి. మరి.. ఈ సినిమాకి సంబంధించి ట్విట్టర్ రివ్యూస్ ఎలాగున్నాయో చూద్దాం.

చదవండి: సలార్ రివ్యూ & రేటింగ్

సాధారణంగానే ఇండియాలో కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్స్ పడతాయి. అక్కడ సినిమా చూసిన అభిమానులు అసలు సినిమా ఎలా ఉంది? హిట్టా.. ఫట్టా? అనే విషయాలను తమదైనశైలిలో చెబుతారు. ఈ ట్విట్టర్ రివ్యూ కూడా సినిమా టాక్ ని డిసైడ్ చేస్తుంది. అయితే సలార్ సినిమాకి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ప్రభాస్ ని స్క్రీన్ మీది చూసి స్టన్ అయ్యిపోయాం అంటున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ ని చూస్తే రెండు కళ్లు చాలలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ స్టైల్ లో ఉన్న మేకింగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ట్రైలర్స్ చూసింది ఒకెత్తు అయితే బిగ్ స్ర్కీన్ మీద మాస్ జాతర అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ విశ్వరూపం చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి. ఈ మూవీ కేవలం యాక్షన్ సినిమా అనుకుంటే మీరు పొరపడినట్లే అంటున్నారు. ఎందుకంటే ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్, ఒక మంచి స్నేహం అందరినీ కట్టిపడేస్తాయని చెబుతున్నారు. ప్రాణ స్నేహితులు, శత్రువులు ఎలా అయ్యారు అనే పాయింట్ కూడా ఆకట్టుకుంటుంది.

అంతేకాకుండా ఈ మూవీలో ఉన్న కాస్టింగ్ మొత్తం తమ తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటున్నారు. ప్రతి పాత్ర ఒక మార్క్ ని క్రియేట్ చేస్తుంది అంటున్నారు.  ప్రశాంత్ నీల్ చూపించిన కాన్సార్.. ఆడియన్స్ ని వేరే ప్రంచానికి తీసుకెళ్లింది అంటున్నారు. ఇంక ఈ మూవీ కూడా కేజీఎఫ్ స్టైల్ లోనే మ్యూజిక్, టేకింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ విభాగాల్లో మెప్పిస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే యూఎస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ కూడా అర్ధరాత్రి ఒంటి గంట షోకి సంబంధించి టాక్ కూడా వస్తోంది. మెంటల్ మాస్ అంటూ కామెంట్సు చేస్తున్నారు. 2 గంటల 55 నిమిషాల పాటు మీరు ఎక్కడ ఉన్నారు? అనే విషయాన్ని మర్చిపోయి సలార్ ప్రపంచంలోకి వెళ్లిపోతారంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సలార్ కి పోటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే డంకీ మూవీకి అంత మంచి టాక్ రాలేదు. ఇప్పుడు సలార్ కి వచ్చిన టాక్ చూసి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి