iDreamPost

Prabhas: ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్​డేట్!

  • Published Dec 28, 2023 | 6:24 PMUpdated Dec 28, 2023 | 6:24 PM

‘సలార్’ సూపర్ హిట్ అవ్వడంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విజయంతో జోష్​లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్​కు మరో క్రేజీ అప్​డేట్ వచ్చేసింది.

‘సలార్’ సూపర్ హిట్ అవ్వడంతో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విజయంతో జోష్​లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్​కు మరో క్రేజీ అప్​డేట్ వచ్చేసింది.

  • Published Dec 28, 2023 | 6:24 PMUpdated Dec 28, 2023 | 6:24 PM
Prabhas: ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2898 ఏడీ’ నుంచి అదిరిపోయే అప్​డేట్!

‘సలార్’ మేనియా ఇంకా పోవట్లేదు. భారత సినీ ప్రేక్షకులు ఇంకా ప్రభాస్ కొత్త సినిమా మైకం నుంచి కోలుకోలేదు. రెబల్ స్టార్ మాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ స్టైలిష్ మేకింగ్​, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్​లు ఇచ్చిన కిక్ నుంచి ఇంకా బయట పడలేదు. ఆ మూవీని థియేటర్లకు వెళ్లి రిపీటెడ్​గా చూస్తున్నారు. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్​ను మళ్లీ తాము ఎలా చూడాలనుకున్నామో అలా చూసినందుకు సంతోషంలో మునిగిపోయారు. ‘సలార్’ సక్సెస్​ను వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా చాన్నాళ్ల తర్వాత బ్లాక్​బస్టర్ హిట్ కొట్టాననే ఆనందంలో ఉన్నారు. తన తదుపరి మూవీస్​ కూడా ఇలాగే విజయం సాధించాలనే ఉద్దేశంతో మరింతగా శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో డార్లింగ్ ఫ్యాన్స్​కు మరో గుడ్ న్యూస్. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్​డేట్ వచ్చేసింది.

‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మోస్ట్ అవేయిటెడ్ ప్రాజెక్ట్స్​లో ఒకటిగా ఉంది. సైన్స్ ఫిక్షన్ జోనర్​లో వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్​పెక్టేషన్స్ ఒక రేంజ్​లో ఉన్నాయి. ఈ ఫిల్మ్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్ వీడియో నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాయి. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న ‘కల్కి’ నుంచి లేటెస్ట్​గా మరో అప్​డేట్ వచ్చింది. ఈ సినిమాలోని విశేషాల గురించి చెప్పేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ నేరుగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్-23లో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్ 29, మధ్యాహ్నం 2 గంటలకు ముంబై ఐఐటీలోని కాన్వొకేషన్ హాల్​లో మీటింగ్ జరగనుంది. ఇందులో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొననున్నారు.

new update from kalki

ఐఐటీ ముంబైలో జరగబోయే టెక్ ఫెస్ట్ గురించి ‘కల్కి 2898 ఏడీ’ మూవీ టీమ్ ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ప్రోగ్రామ్​లో నాగ్ అశ్విన్​ ఏమేం చెప్పబోతున్నారు, ప్రభాస్ సినిమాకు సంబంధించిన సరికొత్త విశేషాలు ఇంకేమైనా చెబుతారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ‘కల్కి 2898 ఏడీ’లో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటానీతో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్​తో ఈ ఫిల్మ్​ను తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ టాక్. కాగా, ‘కల్కి’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను పాపులర్ ఓటీటీ కంపెనీ నెట్​ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి.. ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ చెప్పబోయే విశేషాలను తెలుసుకునేందుకు మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Salaar: సలార్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించిన ఈమె ఎవరో తెలుసా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి