iDreamPost

ప్రభాస్ సరసన నటించిన ఈ బ్యూటీ గుర్తుందా? ఇలా మారిపోయిందేంటి?

  • Author singhj Updated - 08:57 AM, Wed - 15 November 23

ప్రభాస్ సరసన నటించిన ఈ అందాల భామను మీరు గుర్తుపట్టే ఉంటారు. అప్పట్లో టాలీవుడ్​లో పలు సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని నెటిజన్స్ అంటున్నారు.

ప్రభాస్ సరసన నటించిన ఈ అందాల భామను మీరు గుర్తుపట్టే ఉంటారు. అప్పట్లో టాలీవుడ్​లో పలు సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని నెటిజన్స్ అంటున్నారు.

  • Author singhj Updated - 08:57 AM, Wed - 15 November 23
ప్రభాస్ సరసన నటించిన ఈ బ్యూటీ గుర్తుందా? ఇలా మారిపోయిందేంటి?

రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మామూలుగా లేదు. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా క్రేజీ మూవీస్​ను లైనప్​లో పెట్టాడు డార్లింగ్. భారీ హిట్లు కొట్టాలనే టార్గెట్​తో ఉన్న ఈ స్టార్ హీరో నుంచి నెక్ట్స్ బిగ్ ఫిల్మ్స్ రానున్నాయి. అందులో మొదటగా రానుంది ‘సలార్’. శాండల్​వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆఖర్లో రిలీజ్ కానుంది. ‘సలార్​’తో పోటీ పడలేమంటూ చాలా చిత్రాలు రిలీజ్ డేట్స్​ను మార్చుకుంటున్నాయి. దీన్ని బట్టే ప్రభాస్-నీల్ మూవీ మీద ఎక్స్​పెక్టేషన్స్​ ఏ రేంజ్​లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క టాలీవుడ్​లోనే కాదు.. శాండల్​వుడ్, కోలీవుడ్, బాలీవుడ్​లోనూ ప్రభాస్​ సినిమాతో ఎవ్వరూ పెట్టుకోవడం లేదు.

‘సలార్’ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న చిత్రం ‘కల్కి’. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ బ్యాగ్రౌండ్​లో రూపొందుతోంది. అయితే ఇందులో హిందూ పురాణాల్లోని కొన్ని పాత్రలు కూడా కనిపిస్తుండటం విశేషం. ‘కల్కి’ని పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లెవల్లో భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ మూవీస్​లోనే కనీవినీ ఎరుగని బడ్జెట్​తో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ‘కల్కి’ సక్సెస్ అయితే హాలీవుడ్ నుంచి ప్రభాస్​కు ఆఫర్లు క్యూ కట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు మూవీ గోయర్స్, సాధారణ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు.

ఇక, ప్రభాస్​ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ లేటెస్ట్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఒకే సంవత్సరం రెండు భాషల్లో సినిమాలు చేసి శాండల్​వుడ్​తో పాటు టాలీవుడ్​లోనూ ఎంట్రీ ఇచ్చిందా ముద్దుగుమ్మ. ఆ తర్వాత మాలీవుడ్, బాలీవుడ్​లోనూ మూవీస్ చేసింది. అయితే ఇన్ని భాషల్లో యాక్ట్ చేసినా ఆమె కెరీర్ మొత్తంలో చేసింది కేవలం ఏడు సినిమాలే. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. శ్వేతా అగర్వాల్. 2002లో వచ్చిన ‘అల్లరి’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘కిచ్చ’తో కన్నడ ఆడియెన్స్​కు పరిచయమైంది. ఆ మరుసటి ఏడాది ప్రభాస్ ‘రాఘవేంద్ర’లో నటించింది.

శర్వానంద్-నరేష్​ల ‘గమ్యం’ మూవీలో హత్తిరి చింతామణి అనే ఐటమ్ సాంగ్​లోనూ అలరించింది శ్వేతా అగర్వాల్. అయితే ‘షాపిత్’ అనే హారర్ మూవీ తర్వాత సిల్వర్ స్క్రీన్​కు గుడ్ బై చెప్పేసిందామె. ఛాన్సులు లేకపోవడంతోనే ఆమె పరిశ్రమకు దూరమయ్యారని టాక్. ‘షాపిత్’లో యాక్ట్ చేసిన ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్​తో ఆమె ప్రేమలో పడింది. ఆ తర్వాత 2020లో మ్యారేజ్ చేసుకున్న శ్వేత-ఆదిత్య జంటకు ఒక ఆడబిడ్డ పుట్టింది. కూతురుతో ఈ హీరోయిన్ ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్.. శ్వేతా అగర్వాల్ బొద్దుగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shweta Agarwal Jha (@shwetaagarwaljha)

ఇదీ చదవండి: మెగా సెలబ్రేషన్స్​లో మంచు లక్ష్మి సందడి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి