iDreamPost

ఈ కాంబినేషన్ మీరు అస్సలు ఊహించి ఉండరు.. ఆ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?

  • Author Soma Sekhar Published - 11:13 AM, Sat - 18 November 23

టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. సినీ పండితులు కూడా అస్సలు ఊహించని కాంబినేషన్ రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని సమాచారం.

టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. సినీ పండితులు కూడా అస్సలు ఊహించని కాంబినేషన్ రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని సమాచారం.

  • Author Soma Sekhar Published - 11:13 AM, Sat - 18 November 23
ఈ కాంబినేషన్ మీరు అస్సలు ఊహించి ఉండరు.. ఆ స్టార్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?

ఇండస్ట్రీలో పలానా హీరోతో పలానా డైరెక్టర్ మూవీ చేస్తున్నాడనగానే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇక ఆ హీరో స్టార్ అయితే.. ఆ డైరెక్టర్ కూడా స్టార్ అయితే, ఇంకేముంది ఆ పిక్చర్ పై ఎక్కడా లేని బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం అలాంటి అంచనాలను పెంచేస్తూ.. టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. సినీ పండితులు కూడా అస్సలు ఊహించని కాంబినేషన్ రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో నటిస్తున్నాడని సమాచారం. ఆ దర్శకుడు టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో బ్లాక్ బస్టర్ హిట్స్ తీశాడు. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియానే కాకుండా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కీ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా మంది స్టార్ డైరెక్టర్లతో పాటుగా యంగ్ డైరెక్టర్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. డార్లింగ్ ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ కాంబినేషన్ మీరు కలలో కూడా ఊహించి ఉండరు కదా? వీరిద్దరి కాంబోలో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నారట యూవీ క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు. ఈ రెండు నిర్మాణ సంస్థలకు ప్రభాస్-త్రివిక్రమ్ లు ఎంత దగ్గరి మనుషులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలని భారీగానే ప్లాన్ జరుగుతోందట. ప్రస్తుతం డార్లింగ్ నటించే సినిమాలు అవ్వగానే ఇందుకు సంబంధించిన పనులు మెుదలుపెడతారని సమాచారం. కాగా.. యంగ్ రెబల్ స్టార్ ‘సలార్’తో డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడంతో.. సలార్ పై భారీగా అంచనాలు ఏర్పాడ్డయి. పైగా కేజీఎఫ్ కు సలార్ కు లింక్ ఉన్నట్లుగా కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. ‘కల్కి’ సైతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాల తర్వాత డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హార్రర్, కామెడీ చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ అనే మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డార్లింగ్, త్రివిక్రమ్ ల మూవీ ఉంటుందని సమాచారం. మరి ఈ స్టార్ కాంబోలో సినిమా వస్తే.. ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి