iDreamPost

ఫ్యాన్ దెబ్బకు ప్రసాద్స్ ఐమాక్స్ గగ్గోలు.. దెబ్బకు సలార్ టికెట్ ఇచ్చేశాడు!

Prasads Multiplex Given Salaar Ticket: సలార్ సినిమా టికెట్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు యుద్ధాలు చేస్తున్నారు. ఏ థియేటర్లో చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

Prasads Multiplex Given Salaar Ticket: సలార్ సినిమా టికెట్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు యుద్ధాలు చేస్తున్నారు. ఏ థియేటర్లో చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

ఫ్యాన్ దెబ్బకు ప్రసాద్స్ ఐమాక్స్ గగ్గోలు.. దెబ్బకు సలార్ టికెట్ ఇచ్చేశాడు!

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబో కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ సలార్ కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో సలార్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ గా సదండి సందడి చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ఆశతో.. ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది తమకు టికెట్స్ దొరకలేదంటూ బాధతో కూడా ఉన్నారు. బుక్ మై షోలో ఏ థియేటర్ లో టికెట్స్ రిలీచ్ చేసినా కూడా నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోతున్నాయి. ఇప్పటికీ టికెట్స్ దొరకని అభిమానులు మాత్రం ఎక్కడ టికెట్స్ దొరుకుతాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ప్రసాద్స్ ఐమ్యాక్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ప్రస్తుతం సలార్ సినిమా టికెట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బయట పరిస్థితి ఎలా ఉందంటే రిలీజ్ సంగతి పక్కన పెడితే.. కనీసం రెండ్రోజుల తర్వాత అయినా టికెట్ దొరికితే బాగుండు అనుకునేలా ఉంది. అలాంటి తరుణంలో ప్రసాద్స్ ఐమ్యాక్స్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఎక్స్ ఖాతాలో ఫాలోవర్స్ ఒక్కో మైల్ స్టోన్ దాటే సందర్భంలో 2 టికెట్స్ గివ్ అవే ఇస్తామంటూ ప్రకటించింది. 7 వేలు చేరుకోగానే రెండు టికెట్స్ ఇస్తామని చెప్పింది. అరుణ్ అనే ఒక ఫాలోవర్ కి టికెట్ ఇచ్చేసింది. అలాగే మరో టికెట్ ని ధర్మా అనే యూజర్ కి ఇచ్చారు. అయితే అది అంత తేలిగ్గా ఇవ్వలేదు. ఇంక నీ మెసేజులు, మెయిల్స్ ఆపు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతూ టికెట్ ని అతనికి మెసేజ్ చేశారు. రేపు నువ్వు థియేటర్ కి వచ్చేయ్ అంటూ తమ అధికారిక ఖాతాలో ధర్మా అనే యూజర్ పోస్టును రీపోస్ట్ చేస్తూ చెప్పారు.

ఆ అభిమాని ఒక పోస్ట్ చేశాడు. అందులో ఒక స్క్రీన్ షాట్ ఉంది. అదేంటంటే.. అతను మొబైల్ వాడుతున్న స్క్రీన్ టైమ్ ని చూపించాడు. అందులో ఉదయం 6 గంటలు నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నట్లు చూపించింది. అతను అదే పనిగా సరాల్ సినిమా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేసి చెక్ చేస్తున్నట్లు చెప్పాడు. 22వ తారీఖు టికెట్స్ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తావ్ అంటూ ప్రశ్నించాడు. అతను పెడుతున్న మెసేజ్ లు, పోస్టుల దెబ్బకు రెండో టికెట్ ని అతనికే ఇచ్చేసింది. ఇంక నీ మెసేజ్ లు, మెయిల్స్ ఆపు బాబోయ్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఆ విధంగా ఒక అభిమాని టార్చర్ పెట్టి మరీ సలార్ సినిమా టికెట్ సొంతం చేసుకున్నాడు.

ఇంక సినిమా విషయానికి వస్తే.. సలార్ మూవీపై వరల్డ్ వైడ్ గా ఎన్నో అంచనాలు ఉన్నాయి. యష్ ఉంటాడా ఉండడా? ఇది ఉగ్రం రీమేకా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నేరుగా పలు సందర్భాల్లో సమాధానం చెప్పాడు. ఈ మూవీలో యష్ ఉండడని ముందే చెప్పాడు. మరోవైపు తాజాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి ఉగ్రం సినిమాకి ఉన్న లింక్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. అదేంటంటే.. ఈ మూవీ ఉగ్రం సినిమా స్టోరీనే అంటూ చెప్పాడు. అయితే ఆ కథను ప్రభాస్, పృథ్వీలకు ఆపాదిస్తూ మార్పులు చేర్పులు చేశాడన్నాడు. ఉగ్రం సినిమాని కేజీఎఫ్ హైట్స్ తీసుకెళ్లాలి అన్నదే తన ఆశ అంటూ చెప్పుకొచ్చాడు. మరి.. సలార్ మూవీకి మీకు టికెట్స్ దొరికాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి