iDreamPost

కెరీర్​లో ఫస్ట్ టైమ్ ఆ సాహసం చేస్తున్న ప్రభాస్.. ‘సలార్’ కోసం ఏకంగా..!

  • Author singhj Published - 07:51 PM, Mon - 21 August 23
  • Author singhj Published - 07:51 PM, Mon - 21 August 23
కెరీర్​లో ఫస్ట్ టైమ్ ఆ సాహసం చేస్తున్న ప్రభాస్.. ‘సలార్’ కోసం ఏకంగా..!

‘కేజీఎఫ్’ సిరీస్​తో పాన్ ఇండియా రేంజ్​లో పాపులారిటీని సంపాదించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సిరీస్ తర్వాత ఆయన నుంచి వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్​తో జతకట్టిన ప్రశాంత్ నీల్.. ఈసారి కూడా మరో యాక్షన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఆయన తీస్తున్న ‘సలార్’ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను బాగా పెంచేసింది. తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త ఆ ఎక్స్​పెక్టేషన్స్​ను రెట్టింపు చేసేలా ఉంది. ప్రభాస్ ఫ్యాన్ ఒకరు.. ‘సలార్’ సెట్​లో తాను చూసిన వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

‘సలార్’ సినిమా సెట్​లో తాను చూసిన విషయాల గురించి చెబుతూ ప్రభాస్ అభిమాని చేసిన ఓ వీడియో నెట్టింట్ తెగ సందడి చేస్తోంది. ఇందులో ఆ అభిమాని మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ ప్రతి చిన్న డీటెయిల్​ను క్షుణ్నంగా పరిశీలిస్తూ బాగా వచ్చే వరకూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలిపారు. అలాగే మూవీలో ఓ యాక్షన్ సీన్ ఉంటుందని, అందులో ప్రభాస్ ఏకంగా 1,000 మందితో ఫైట్ చేస్తారని చెప్పారు. అదే టైమ్​లో మరో క్యారెక్టర్​తో ప్రభాస్ రీఎంట్రీ ఇస్తారని వెల్లడించారు. ఈ సీన్ చూసి తాను షాకైనట్లు తెలిపారు. దీంతో ఈ సన్నివేశాన్ని స్క్రీన్​పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ఇక, ఈ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిర్గందూర్ (హొంబలే ఫిల్మ్స్) కూడా గతంలో ఒక మీడియా సంస్థతో ‘సలార్’ క్లైమాక్స్ గురించి మాట్లాడినట్లు న్యూస్ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని.. అవి కచ్చితంగా ఓ బెంచ్​మార్క్​ను క్రియేట్ చేస్తాయని విజయ్ కిర్గందూర్ చెప్పినట్లు అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఒకవేళ ఆయన చెప్పిందే జరిగితే థియేటర్లు షేక్ అవడం గ్యారెంటీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘సలార్’.. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రభాస్ తన కెరీర్​లో ఫస్ట్ టైమ్ డ్యుయల్ రోల్​లో కనిపించనున్నారనే వార్తల నేపథ్యంలో ‘సలార్’ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి