iDreamPost

Prabhas టాలీవుడ్ నెం1 స్టార్, అల్లు అర్జున్ ను దాటేసిన ప్ర‌భాస్, టాప్ 10 లిస్ట్ లో ఎవ‌రెవ‌రంటే!

Prabhas టాలీవుడ్ నెం1 స్టార్, అల్లు అర్జున్ ను దాటేసిన ప్ర‌భాస్, టాప్ 10 లిస్ట్ లో ఎవ‌రెవ‌రంటే!

Prabhas టాలీవుడ్ నెం1 స్టార్, అల్లు అర్జున్ ను దాటేసిన ప్ర‌భాస్, టాప్ 10 లిస్ట్ లో ఎవ‌రెవ‌రంటే!

Prabhas టాలీవుడ్ నెం1 స్టార్, అల్లు అర్జున్ ను దాటేసిన ప్ర‌భాస్, టాప్ 10 లిస్ట్ లో ఎవ‌రెవ‌రంటే!

Prabhas, Jr NTR, Allu Arjun, Ram Charan , చిరంజీవి లాంటి స్టార్లు Ormax Media’s Most popular male
Telugu film stars జాబితాలో ఉన్నారు.

ప్ర‌భాస్ Prabhas
ఇటీవల, Ormax మీడియా Ormax’s Most popular male Telugu film stars (జూన్ 2022) జాబితాను రిలీజ్ చేసింది. ప్రభాస్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. రాధే శ్యామ్ డిజాస్టర్ అయినా, వ‌రుస‌లో Adipurush, Salaar, Project K, Raja Deluxe, Spirit ఉన్నాయి. అందుకే ప్ర‌భాస్ ఏం చేసినా హెడ్ లైనే. అత‌ని చిన్నచిన్న అప్ డేట్స్ కూడా ట్రెండ్ అవుతాయి. ప్ర‌భాస్ మీద ఇప్ప‌టికే వెయ్యికోట్ల రుపాయిల మేర పెట్టుబ‌డులు పెట్టారు. అందుకే ఆయ‌నంటే బాలీవుడ్ చాలా ఇష్టం. ఇండ‌స్ట్రీని ఒక్క‌చేత్తో లాక్కురాగ‌ల స‌త్తా ఉంద‌ని సినిమా పండితులు అంటారు.

జూనియర్ ఎన్టీఆర్ Jr NTR
RRR తో ప్యాన్-ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, రెండో స్థానంలో నిలిచాడు. NTR30 , NTR 31 మ‌రింత ఎదిగే అవ‌కాశ‌ముంది. ఇక‌పై ఎన్టీయార్ సినిమాల‌న్నీ ప్యాన్ ఇండియ‌న్ మూవీస్.

అల్లు అర్జున్ Allu Arjun
పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) తర్వాత, అల్లు అర్జున్ అత్యంత ప్రజాదరణ పొందిన పాన్-ఇండియా స్టార్‌(most popular pan-India stars)లో చోటు ద‌క్కించుకున్నారు. లిస్ట్ లో అల్లుది థ‌ర్డ్ ప్లేస్. పుష్ప సీక్వెల్ తో ఇండియాను గ‌డ‌గ‌డ‌లాడించ‌డం ఖాయం.

మహేష్ బాబు Mahesh Babu
మహేష్ బాబు రియ‌ల్ సూప‌ర్ స్టార్. సర్కారు వారి పాట కలెక్ష‌న్స్ మళ్లీ మ‌హేష్ ను టాప్ ఫామ్‌లోకి తెచ్చాయి. రామ్ చ‌ర‌ణ్ క‌న్నా నటుల జాబితాలో ముందులో ఉన్నాడు.

రామ్ చరణ్ Ram Charan
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయితే, ఆచార్య దెబ్బ‌కొట్టింది. రామ్ చరణ్ అభిమానులు ఇప్పుడు RC15 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Ormax’s Most popular male Telugu film stars ఐదు స్థానాల్లో నిలిచాడు.

పవన్ కళ్యాణ్ Pawan Kalyan
త‌న‌సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు కాక‌పోయినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. ఆయ‌నుకున్న‌క‌ల్ట్ ఫాలోయింగ్ వ‌ల్లే పవన్ కళ్యాణ్ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. అత‌ని స్టార్ డ‌మ్ కు తిరుగులేదు.
Prabhas is Tollywood's No. 1 star, Prabhas who has surpassed Allu Arjun, who is in the top 10 list

నాని Nani
నాని అంటే సుందరానికి బాక్సాఫీస్ వద్ద యావ‌రేజ్ గా న‌డిచింది. కాని తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. మిడ్ రేంజ్ హీరోల్లో నాని సూప‌ర్ స్టార్. అందుకే ఈ జాబితాలో నాని 7వ స్థానం.

చిరంజీవి Chiranjeevi
ఓర్మాక్స్ Ormax’s Most popular male Telugu film stars లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి 8వ స్థానం అంటే మెగాఫ్యాన్స్ ఒప్పుకోక‌పోవ‌చ్చుగాని, ఆచార్య త‌ర్వాత ఆయ‌న పాపులారిటీ బాగా త‌గ్గింది. ఇప్పుడు గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్ వంటి సినిమాల లైన‌ప్ ఉంది. నెక్ట్స్ ఇయ‌ర్ ఆయ‌న లిస్ట్ లో ముందుకు రావ‌చ్చు.

విజయ్ దేవరకొండ Vijay Deverakonda
విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం లైగర్ బజ్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్ నుండి పాటల వరకు లైగ‌ర్ అప్ డేట్స్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ జాబితాలో విజయ్ ది 9 వ స్థానం.

రవితేజ Ravi Teja
మాస్ మ‌హారాజ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. Ramarao on Duty, Ravanasura, Dhamaka, and Tiger Nageswara Rao సినిమాలతో ఆయ‌న క్రేజ్ ను పెంచుకోనున్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆమేర‌కు రిలీజ్ అయిన చిన్న విడియో ట్రెండ్ అవుతోంది.
Prabhas is Tollywood's No. 1 star, Prabhas who has surpassed Allu Arjun, who is in the top 10 list

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి