iDreamPost

Prabhas & Allu Arjun : దశాబ్దం తర్వాత జరగనున్న అరుదైన కలయిక

Prabhas & Allu Arjun : దశాబ్దం తర్వాత జరగనున్న అరుదైన కలయిక

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 విడుదల ఇంకో 16 రోజులు మాత్రమే సమయం ఉంది. 6న ట్రైలర్ ని వదలబోతున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు మోస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించేందుకు మైత్రి సంస్థ గట్టి ఏర్పాట్లే చేస్తోంది. దానికి అనుగుణంగా గెస్ట్ ని ఫిక్స్ చేసే పనిలో పడ్డారట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిధిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్పకు అప్పీల్ రావాలంటే ఇవి చాలా అవసరం.

ప్రభాస్ బన్నీ ఒకే స్టేజి మీద కనిపించి సుమారు పదేళ్లవుతోంది. అప్పుడు ఇద్దరికీ ఈ స్థాయి మార్కెట్ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. డార్లింగ్ ఒక్కడే వెయ్యి కోట్ల సినిమాలు చేతిలో ఉన్న సూపర్ స్టార్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ సైతం కేరళ లాంటి రాష్ట్రాల్లో బలమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకుని ఇప్పుడు దేశవ్యాప్త గుర్తింపును టార్గెట్ చేశాడు. సో ప్రభాస్ వస్తే కనక నార్త్ లోనూ పుష్ప మీద బజ్ పెరుగుతుంది. రాధే శ్యామ్ పనులతో పాటు ఇతర షూటింగుల్లో బిజీగా ఉన్న బాహుబలి మరి నిజంగా వస్తాడా లేదా అనేది వేచి చూడాలి. ఈ అరుదైన కాంబినేషన్ వేదిక మీద కనిపించడం కన్నా అభిమానులకు కన్నులపండగ ఏముంటుంది

చేతిలో ఉన్న అతి తక్కువ టైంని చూసుకుని సుకుమార్ టీమ్ పరుగులు పెడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే పది రోజుల లోపే సెన్సార్ చేయించాలి. మరోపక్క బిజినెస్ వ్యవహారాలు థియేటర్ల కేటాయింపు లాంటి పనులు జరిగిపోతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా 2021లోనే ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఇది నిలుస్తుందనే నమ్మకంతో ఫాన్స్ ఉన్నారు. కానీ అదంత ఈజీ కాదు. ఏ సెంటర్స్, ఉత్తరాది రాష్ట్రాల్లో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా వసూళ్ల పరంగా చిక్కు తెచ్చేలా ఉంది. అది ఒక రోజు ముందు రిలీజ్ కావడం కొంత ఊరట. అఫ్కోర్స్ పుష్పలో కంటెంట్ రంగస్థలం అంత బలంగా ఉంటే హాలీవుడ్ మూవీ గురించి భయపడాల్సిన పని లేదు

Also Read : SVP & Liger : మహేష్ సినిమాతో రౌడీ బాయ్ పోటీ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి