SVP & Liger : మహేష్ సినిమాతో రౌడీ బాయ్ పోటీ ?

By iDream Post Nov. 29, 2021, 06:30 pm IST
SVP & Liger : మహేష్ సినిమాతో రౌడీ బాయ్ పోటీ ?

సినిమా విడుదలలు అనూహ్యమైన మార్పులకు లోనవుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ డేట్ కి ఏ టైంకి రిలీజ్ చేస్తారో అసలు మాటకు కట్టుబడి ఉంటారో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో ఆరు నెలల తర్వాత తేదీలను కూడా ఇప్పుడే లాక్ చేసుకోవాల్సి వస్తోంది. విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ తాలూకు సన్నివేశాలన్నీ ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేస్తారు. తిరిగి వచ్చాక బ్యాలన్స్ పార్ట్ ఇక్కడ కంటిన్యూ చేస్తారు. ఇంకో ముప్పై శాతం దాకా పెండింగ్ ఉందని ఇన్ సైడ్ టాక్. ఎంత అనేది బయటికి చెప్పడం లేదు.

ఇప్పుడీ లైగర్ ని 2022 ఏప్రిల్ 1కి థియేటర్లలో తెచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. కానీ అదే రోజు మహేష్ బాబు సర్కారు వారి పాట ఫిక్స్ అయ్యి ఉంది. దాంతో నేరుగా లైగర్ ని పోటీకి దింపడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఇంకా పూరి టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. హిందీ వెర్షన్ నిర్మాత కరణ్ జోహార్ సూచన మేరకు ఈ డేట్ ని అనుకుంటున్నట్టు తెలిసింది. లైగర్ పాన్ ఇండియా మూవీనే కానీ సర్కారు వారి పాట కేవలం సౌత్ వెర్షన్లకు మాత్రమే పరిమితమవుతుంది. హిందీ డబ్బింగ్ చేసే ఆలోచన కూడా ప్రస్తుతానికి మైత్రి టీమ్ కు లేదు. అందుకే లైగర్ కాంపిటీషన్ గురించి ఆలోచించడం లేదేమో.

అధికారిక ప్రకటన వచ్చేదాకా చెప్పలేం కానీ విజయ్ దేవరకొండ అభిమానుల అంచనాలు లైగర్ మీద మాములుగా లేవు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ బాక్సింగ్ డ్రామాని హిట్ చేయడం హీరోకి దర్శకుడికీ ఇద్దరికీ చాలా అవసరం. ఇప్పటిదాకా టీజర్ కానీ లిరికల్ వీడియో కానీ ఏదీ రిలీజ్ కాలేదు. అంతెందుకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కూడా ప్రకటించలేదు. బాలీవుడ్ బ్యాచే అయ్యుండొచ్చు. గీత గోవిందం తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ విజయ్ దేవరకొండకు మళ్ళీ దక్కలేదు. అందుకే లైగర్ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఒకవేళ హిట్ అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా అదే

Also Read : Third Wave : మూడో వేవ్ ఆందోళనలో టాలీవుడ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp