iDreamPost

Prabhas : తక్కువ సమయం ఎక్కువ లాభం సూత్రమిదే

Prabhas : తక్కువ సమయం ఎక్కువ లాభం సూత్రమిదే

బాహుబలి తర్వాత అదేంటో ప్రభాస్ ఏ సినిమా చేసినా కనీసం రెండు మూడేళ్లు పడుతోంది. కారణం ఏదైనా ఇది అభిమానులను అసంతృప్తికి గురి చేస్తున్న మాట వాస్తవం. నేషనల్ లెవెల్ లో స్టార్ గా ఎదిగాడన్న ఆనందం ఉన్నప్పటికీ ఏడాదికి కనీసం ఒకటి రెండు చూడాలన్న కోరిక వాళ్ళలోనూ ఉంటుందిగా. అందుకే ప్రభాస్ ఇకపై పాన్ ఇండియా మూవీస్ తో పాటు తక్కువ టైంలో అయిపోయే లిమిటెడ్ బడ్జెట్ చిత్రాలను చేయాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. మరి దీనికి పవన్ కళ్యాణ్ కి లింక్ ఏమిటనే సందేహం రావొచ్చు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, వినోదయ సితం రీమేక్ ఉదాహరణలు గమనిస్తే ఈజీగా మ్యాటర్ అర్థమైపోతుంది.

ఈ మూడు సినిమాలు పవన్ చాలా తక్కువ టైంలో పూర్తి చేసినవి చేయబోతున్నవి. బడ్జెట్ కూడా భారీగా ఉండదు. పారితోషికం మినహాయిస్తే మిగిలిన ఖర్చంతా ఓ మీడియం రేంజ్ హీరోకు పెట్టినంత అవుతుందంతే. కానీ నిర్మాత మాత్రం పవర్ స్టార్ బ్రాండ్ ని వాడుకుని ఈజీగా వంద కోట్ల బిజినెస్ చేసుకునేలా లాభాల పంట పండిస్తుంది. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ సూత్రంలో ఇది బ్రహ్మాండంగా పేలే ప్లాన్. అందుకే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ లను పక్కనపెట్టి మరీ పవన్ వినోదయ సితం రీమేక్ కు కేవలం ఇరవై రోజుల కాల్ షీట్స్ ఇచ్చారన్న వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. పారితోషికం కూడా యాభై కోట్లట.

ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే మారుతీ దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి యాభై వర్కింగ్ డేస్ మాత్రమే కేటాయిస్తారట. రాజా డీలక్స్ టైటిల్ ని ప్రస్తుతానికి వర్కింగ్ కోసం పెట్టుకున్నారు కానీ అది మారే అవకాశం ఉంది. ఉగాది రోజు షూటింగ్ మొదలుపెట్టొచ్చనే టాక్ ఉంది. ఇప్పటిదాకా ప్రభాస్ చేసినవాటిలో ఇదే ఫాస్ట్ గా అయ్యే మూవీ కావొచ్చు. ఎలా చేసినా పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ జరగడం చాలా ఈజీ. సలార్, ఆది పురుష్ అయ్యాక ప్రాజెక్ట్ కె కన్నా ముందు ఈ రాజా డీలక్స్(టైటిల్ మారొచ్చు)వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది

Also Read : Samantha :పెళ్ళయాక కూడా ఆఫర్ల వెల్లువ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి