iDreamPost

ఒక్క నవ్వుతో ఫేమస్ అయిన ఇతను.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే?

యూట్యూబ్ లేదా ఇన్ స్టాలో ఓ ఫన్నీ వీడియో చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఫక్కున నవ్వుతూ ఓ మీమ్ వస్తుంటుంది. మరీ అతడు ఎవరు..? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..? ఓ సారి దీనిపై లుక్కేయండి.

యూట్యూబ్ లేదా ఇన్ స్టాలో ఓ ఫన్నీ వీడియో చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఫక్కున నవ్వుతూ ఓ మీమ్ వస్తుంటుంది. మరీ అతడు ఎవరు..? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..? ఓ సారి దీనిపై లుక్కేయండి.

ఒక్క నవ్వుతో ఫేమస్ అయిన ఇతను.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే?

సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో ఫన్నీ వీడియోలు, రివ్యూస్, రీల్స్, షాట్స్, కుకింగ్ చేసి ఫేమస్ అయినవారున్నారు. కాస్త ఫేమస్ అయ్యి, సబ్ స్రైబర్స్ వస్తే చాలు.. ప్రమోషన్ల రూపంలో కూడా సంపాదిస్తూనే పాపులారిటీని కూడగట్టుకుంటున్నారు. కానీ వీడియో గేమ్స్ ఆడి డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు. మరీ అలా వీడియో గేమ్స్ ఆడి మనీని ఎర్న్ చేయడమే కాదు.. ఓ వ్యక్తి అయితే మీమర్ల పాలిట గాడ్ అయ్యాడు. ఒక్క చిన్న లాఫింగ్ వీడియో.. మీమ్స్‌గా వినియోగించడంతో పాటు కొన్నిలక్షల వీడియోలకు లాఫింగ్ టెంప్లెంట్‌గా మారింది. ఇంతకు ఫక్కున నవ్వు నవ్విన ఇతడు ఎవరో తెలుసా..?

యూట్యూబ్, ఇన్ స్టాలో ఏదైనా వీడియో చూస్తే ఫన్నీ, కౌంటర్స్ వచ్చినప్పుడు.. ఓ మీమ్ వస్తుంది. అదే లాఫింగ్ వీడియో.. ఓ వ్యక్తి హెడ్ సెట్స్ పెట్టుకుని ‘హా హా హా’ అంటూ బిగ్గరగా నవ్వుతాడు. ఇప్పుడు మనం చూస్తున్న మీమ్ వీడియో .. 2016లోది అన్నట్లుగా తెలుస్తోంది. అది చాలా వీడియోలకు మీమ్స్ అయిన సంగతి విదితమే. ఇంత మంది మీమర్ల పాలిట దేవుడిగా మారిన అతడు ఎవరంటే..? ముతహర్ అన్స్. అతడి నవ్వుకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు. కెనడాలోని టొరంటోలో సెటిల్ అయిన ఇండియన్ అని తెలుస్తోంది. హార్రర్ గేమ్స్‌కు రివ్యూస్ ఇస్తూ ఫేమస్ అయ్యాడు. 2012లో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. సమ్ ఆర్డినరీ గేమర్స్ పేరుతో గేమ్స్ రివ్యూస్ ఇస్తూ పాపులారిటీని సంపాదించాడు. ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడంటే..? పూర్తిగా మారిపోయాడు.

ఇప్పటికి కూడా యూట్యూబర్‌గా కొనసాగుతున్నాడు ముతహర్. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్లో సుమారు 3.7 మిలియన్స్ మంది సబ్ స్రైబర్స్ ఉన్నారు. వీడియో గేమ్స్ సంబంధించి రివ్యూస్ ఇస్తూనే ఉన్నాడు. ఈ లెక్క ప్రకారం.. అతడి యూట్యూబర్‌గా బాగానే మూటగట్టుకుంటున్నాడు. అతడి నికర విలువ ఏడాదికి సుమారు 1.5 మిలియన్లు ఉంటుందని అంచనా.. యూట్యూబ్ ఛానల్స్, ప్రమోషన్స్ ద్వారా, బిజినెస్ ద్వారా ఇంత మేరకు సంపాదిస్తున్నాడని టాక్. SomeOrdinaryGamers యూట్యూబ్ ఛానల్ లోగోతో ఉన్న టీషర్ట్స్, మగ్స్, ఇతర వస్తువులను అమ్మి కూడా డబ్బులు సంపాదిస్తున్నాడట. మొత్తానికి వీడియో గేమ్స్ రివ్యూస్ ద్వారా బాగానే కూడగడుతున్నాడు.. ఈ మన మీమర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి