iDreamPost

పొన్నాల రాజీనామాపై వీహెచ్ సంచలన కామెంట్స్!

పొన్నాల రాజీనామాపై వీహెచ్ సంచలన కామెంట్స్!

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు.. నవంబర్ 30 న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతున్నట్లు సీఈసీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడటంతో అధికార, ప్రతిపక్ష నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మరోవైపు కొంతమంది సీనియర్ నేతలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపిస్తే.. అధికార పార్టీపై నిరసన తెలుపుతున్న నేతలు ప్రతిపక్ష పార్టీ కండువల కప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల రాజీనామా ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కి పంపించారు. గత కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అనిశ్చితి ఏర్పడిందని.. బీసీలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీట్లు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఈ విషయం గురించి తాను ఎంత చెప్పినా అధిష్టానం పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఆయన పార్టీకీ రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత రాజీనామా చేయడంతో తెలంగాణ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా.. మంత్రిగా, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన పొన్నాలకు కొంతకాలంగా అవమానాలు ఎదురవుతున్నాయి. జనగామాలో ఆయనను చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయంపై పీసీసీకి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆయన రాజీనామా చేశారు. పొన్నాల లాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ కోల్పోవడం తీవ్ర నష్టం. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా పనిచేసిన నేతకే ఇలాంటి పరిస్తితి ఉంటే.. మిగతా వారి పరిస్తితి ఏంటీ? అన్ని అన్నారు. ఇక్కడ బెదిరించిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. సీట్లు కేటాయిస్తున్నారు. బీసీలకు సీట్ల కేటాయింపులో తీవ్ర నష్టం జరుగుతుంది. పార్టీకి విధేయులుగా ఉన్నవారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి