iDreamPost

వెళ్లినా బెరుకు లేదు.. వచ్చినా ఇబ్బంది లేదు! ఆ గుండెకి భయం తెలియదా?

YS Jagan: ఏపీలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని అవరోధాలు ఎదురైన అలాంటి వారికి భయం అంటూ తెలియదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే సీఎం జగన్ రాజకీయ ప్రస్థానం.

YS Jagan: ఏపీలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి నేతలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని అవరోధాలు ఎదురైన అలాంటి వారికి భయం అంటూ తెలియదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే సీఎం జగన్ రాజకీయ ప్రస్థానం.

వెళ్లినా బెరుకు లేదు.. వచ్చినా ఇబ్బంది లేదు! ఆ గుండెకి భయం తెలియదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది ప్రత్యేకమైన స్థానం. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. తనదైన రాజకీయ, పరిపాలన నిర్ణయాలతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి భయం అనేది లేదు. ముఖ్యంగా వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు భయం అంటే ఏమిటో కూడా తెలియదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత మంది వీడిన ధైర్యం నిలబడి పోరాడటమే ఆ గుండెలకు తెలుసు. అందుకే సీఎం జగన్  ఇటీవల ఎంతమంది పార్టీని వీడిన భయపడలేదు. తాను తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారమే దూసుకెళ్తున్నారు. ఆయన రాజకీయ వ్యవహార శైలి అర్థం కాక.. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వాళ్లు తలలు పట్టుకుంటున్నారు.

“వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేస్తున్నాను” ఈ మాట చెప్పడానికి సీఎం జగన్ కి  రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు.  2009లో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎన్నో రకాలకు హింసలకు గురి చేసిన జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ బెదరలేదు. అంతేకాక 2014లో తన పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అధ్యక్షుడు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు లాక్కున్న ఎక్కడ నిరుత్సాహానికి గురి కాలేదు. అలానే దాదాపు 9ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్ని 2019 అఖండ మోజార్టీతో విజయం సాధించారు.

ఏపీ  రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకుడు సాధించని ఘనత జగన్ మోహన్ రెడ్డి సాధించారు. అలానే 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎవ్వరూ ఊహించని, అంచనా వెయ్యలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి..ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించారు. అలా ప్రత్యర్థుల పన్నిన్న వ్యూహాన్ని సీఎం జగన్ చేధించాడే కానీ.. ఆ గుండె ఎప్పుడు భయపడేలేదు. ఇటీవల ఇన్ ఛార్జీల మార్పులతో, ఇతర కారణాలతో ఆయనకు సన్నిహితంగా ఉండే వారు సైతం పార్టీని వీడారు. ఇప్పుడు కూడా ఎక్కడ సీఎం జగన్ భయపడలేదు. తనకు ఎంతో ఆప్తులుగా ఉండే కొందరు నేతలు పార్టీ వీడిన, పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుందో అనే భయం సీఎం జగన్ లో ఏ మూలన కలగలేదు. తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబపడి ముందుకు సాగుతున్నారు. ఎవరైనా పార్టీ నేతలు మారిన.. ప్రత్నామ్యాయంగా మరో అభ్యర్థిని సిద్ధంగా ఉంచుతున్నారే తప్ప ఎవరిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలు, ఆ సమయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం.

అలానే పార్టీ వీడి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్కే వంటి ఆప్తులను సైతం సీఎం జగన్ అక్కున చేర్చుకుంటున్నారు. వాళ్లు  ఏ ఉద్దేశంతో వచ్చిన కూడా, ఏం జరుగుతుందో అనే భయం లేకుండా జగన్ ముందుకెళ్తున్నారు. ఆర్కే బాటలోనే మరికొందరు నేతలు తిరిగి వైఎస్సార్ సీపీలోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా పార్టీని వీడి వెళ్లిన, వారు ఏదైనా రాజకీయ వ్యూహంతో రావొచ్చు, లేదా జగన్ కి రాజకీయంగా డ్యామేజ్ చేసేలా చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అవేవి పట్టించుకోని, అలాంటి వాటికి భయపడని జగన్ తనదైన శైలీలోనే ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా అధికారంలోకి రాకముందు ఎదురైనా కష్టాలకు ఎక్కడ ఆ గుండె భయపడలేదు. అలానే 2024 ఎన్నికల జరగనున్న తరుణంలో కీలకమైన వ్యక్తులు పార్టీని వీడిన ఆ గుండె భయపడలేదు.  మొత్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలిసిన వారు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ఆ గుండెకు భయం తెలియదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి