iDreamPost

MLA యాక్సిడెంట్ కేసు.. PA ఆకాశ్ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడంటే!

BRS ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పీఏ ఆకాశ్ స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు పోలీసులు. ఈ వాగ్మూలంలో ఆకాశ్ ఏం చెప్పాడంటే?

BRS ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పీఏ ఆకాశ్ స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు పోలీసులు. ఈ వాగ్మూలంలో ఆకాశ్ ఏం చెప్పాడంటే?

MLA యాక్సిడెంట్ కేసు.. PA ఆకాశ్ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడంటే!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించిన విషయం తెసిందే. ఇక ఈ ఘటనపై ఆమె పీఏ ఆకాశ్ పై కేసు నమోదు అయ్యింది. నందిత సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆకాశ్ పై కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాశ్ నుంచి తాజాగా స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. ఈ స్టేట్మెంట్ లో ఆకాశ్ ఏం చెప్పాడంటే?

BRS ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పీఏ ఆకాశ్ స్టేట్మెంట్ ను పటాన్ చెరువు పోలీసులు రికార్డు చేశారు. నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు ఆకాశ్ పై ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో గాయపడిన అతడు తాజాగా స్పృహలోకి రావడంతో.. మెజిస్ట్రేట్ సమక్షంలో అతడి వాగ్మూలాన్ని తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ లో..”మేము దర్గా నుంచి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. అయితే లాస్య భోజనం చేద్దామని అనడంతో.. హోటల్స్ కోసం వెతుకుతూ వెళ్తున్నాం. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగిందో అర్ధం కావడం లేదు. ఆ టైమ్ లో నా మైండ్ బ్లాంక్ అయ్యింది” అని ఆకాశ్ స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ మీడియాకు వివరించాడు. డీఎస్పీ మాట్లాడుతూ..”ముందు వెళ్తున్న వెహికిల్ ను ఢీ కొన్న తర్వాత కారు అదుపుతప్పి… ఓఆర్ఆర్ పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్ ను ఢీ కొట్టింది. అయితే ప్రమాదం జరగడానికంటే ముందే కారు ముందు భాగం పగిలిపోయి ఉంది. నిర్లక్ష్యంగా, అతివేగంగా కారునడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది” అని డీఎస్పీ తెలిపాడు. ఆకాశ్ వాగ్మూలం రికార్డు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి