iDreamPost

నడి రోడ్డుపై నటి హంగామా.. అరెస్టు చేసిన పోలీసులు

మంచి చేసే ఉద్దేశంతో కొన్ని సార్లు తెలియకుండానే చిక్కులు పడుతుంటారు. సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఏదో చేద్దామని అనుకుంటే మరో ఏదో అయినట్లు అయ్యింది ఓ నటి పరిస్థితి. చివరకు ఆమె కటకటాల పాలు అయ్యింది.

మంచి చేసే ఉద్దేశంతో కొన్ని సార్లు తెలియకుండానే చిక్కులు పడుతుంటారు. సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఏదో చేద్దామని అనుకుంటే మరో ఏదో అయినట్లు అయ్యింది ఓ నటి పరిస్థితి. చివరకు ఆమె కటకటాల పాలు అయ్యింది.

నడి రోడ్డుపై నటి హంగామా.. అరెస్టు చేసిన పోలీసులు

 పొరపాటు, తప్పు జరుగుతున్నప్పుడు.. అది చెప్పేందుకు ఓ విధానం ఉంది. కాదని.. ఆవేశంలో ఏదీ పడితే అది మాట్లాడుతూ.. రెచ్చిపోతే.. ముప్పలు తప్పవు. కొంత మంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. దారిని వెళ్లిపోయే దరిద్రాన్ని తలపై పెట్టుకుంటూ ఉంటారు. తామే దేశాన్ని, సంఘాన్ని ఉద్దరించే వ్యక్తులుగా ప్రవర్తిస్తూ మంచి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అది వాళ్లకు రివర్స్ అవుతుంది. తమ ఉనికిని చాటుకునేందుకు పిచ్చి ప్రయత్నాలు చేసి.. తిరిగి వారే చిక్కుల్లో పడుతుంటారు. మంచి చేద్దామని వెళ్లి చెడు తెచ్చుకుందో నటి. ఆమె ఎవరంటే.. బీజెపీ సభ్యురాలు, న్యాయవాది, నటి రంజనా. ఇంతకు ఏం జరిగిందంటే..

 బస్సుల్లో ప్రయాణించేటప్పుడు.. రష్‌గా ఉన్న సమయంలో ఫుడ్ బోర్డ్ పై వేలాడుతూ వెళుతుంటారు విద్యార్థులు. ప్రాంతమేదైనా నిత్యకృత్యం. చెన్నైలోని కెరుగంబాక్కం ప్రాంతంలో తమిళనాడు ఆర్టీసీకి చెందిన బస్సు మెట్లపై వేలాడుతూ కొంత విద్యార్థులు వెళుతుండటం చూశారు నటి రంజన. వెంటనే తన వాహనాన్ని ఓవర్ టేక్ చేసి.. బస్సును ఆపారు. అనంతరం ఫుడ్ బోర్డుపై ఉన్న విద్యార్థులను మందలించారు. మెట్లపై వేలాడుతున్న విద్యార్థులపై కోపంగా అరవడమే కాకుండా.. వారిపై దాడి చేశారు రంజన. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో కూడా గొడవ పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు నెటిజన్లు.

కాగా, నటి రంజనాపై ఆ బస్సు డ్రైవర్ శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంజనా ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులపై దాడి చేయడం, ప్రభుత్వ ఉద్యోగులను పని చేయకుండా అడ్డుకోవడం సహా ఐదు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో కూడా ఆమె వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని, వారెంట్ ఉందా అంటూ హంగామా సృష్టించారు. అయితే నెటిజన్లు మాత్రం ఆమె చేసింది కరెక్టే అయినా.. చెప్పిన విధానం తప్పని మండిపడుతున్నారు. నటి రంజన తమిళ పరిశ్రమలో సహాయక పాత్రల్లో కనిపిస్తుంటారు. ప్రముఖ దర్శకుడు బాలాకు ఆమె దగ్గర బంధువు.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి