iDreamPost

‘భారత్, సనాతన’ విషయంలో మంత్రులకు మోదీ కీలక సూచనలు!

‘భారత్, సనాతన’  విషయంలో మంత్రులకు మోదీ కీలక సూచనలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండు అంశాలపై విసృత్తంగా చర్చలు నడుస్తున్నాయి. అందులో ఒకటి..  ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరిట జీ-20 నేతలకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలు, తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు. ఈ రెండు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  భారత్ అంశంపై రాజకీయా దుమారం చెలరేగా, ఉదయ్ నిధిన్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే  తాజాగా ఈ రెండు అంశాల విషయంపై కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. వివాదాస్పద అంశాలపై సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సరిగ్గా స్పందించాలని మోదీ కేంద్రమంత్రులకు సూచించారు. సనాతన ధర్మ వివాదం, భారత్  అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘భారత్‌’ అంశాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘భారత్‌’ అంశంపై అతిగా స్పందించొద్దని మంత్రులను మోదీ సూచించినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. కేవలం సంబంధిత వ్యక్తులు మాత్రమే ఈ అంశంపై స్పందించాలని మోదీ స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలతో పాటు జీ-20 విదేశీ అతిథులకు పంపిణీ ఆహ్వాన పత్రికల్లో ఇండియా పేరుకు బదులు భారత్ అని ముద్రించారు. దీంతో ఆంగ్లంలోనూ దేశం పేరు ఇక భారత్‌ మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇదే సమావేశంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా ప్రధాని పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని కేంద్రమంత్రులకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ‘చరిత్ర లోతుల్లోకి తొంగిచూడొద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండని మోదీ అన్నారు. సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడండని, వివాదాస్పద వ్యాఖ్యలకు సమర్థమైన స్పందన అవసరమని మోదీ సూచించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై భాజపా నేతలు, హిందూ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అటు విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’లోని కొందరు నేతలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మరి.. కేంద్ర మంత్రులకు మోదీ కీలక సూచనలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి