iDreamPost

మూడోసారి BJPకి అధికారం.. ప్రపంచ మూడో ఆర్థికశక్తిగా భారత్: ప్రధాని

మూడోసారి BJPకి అధికారం.. ప్రపంచ మూడో ఆర్థికశక్తిగా భారత్: ప్రధాని

దేశంలో మూడోసారి కూడా భాజపా నేతృత్వంలోనే ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాముు అధికారంలోకి వచ్చాక జరిగేది ఇదే అంటూ హామీలు కూడా ఇచ్చారు. ఢిల్లీ ప్రగతి మైదానంలో తీర్చిదిద్దిన ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. స్వయంగా డ్రోన్ ఎగరేసి ప్రధాని ఈ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. జీ-20 సమ్మిట్ కు ఈ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. ఈ కన్వెన్షన్ సెంటర్ కు భారత్ మండపం అని నామకరణం చేశారు. తర్వాత దేశ ప్రగతి.. తమ పాలన విషయంలో ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లివంటిదని మొత్తం ప్రపంచమే అంగీకరిస్తోంది. కొత్తగా నిర్మితమైన ఈ భారత్ మండపం మన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెబుతుంది. ఎన్నడూ లేని విధంగా భారత్ ఇప్పుడు ఎన్నో విజయాలు సాధిస్తోంది. అయితే దేశంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ఒక్క భారతీయుడు పార్లమెంట్ కొత్త భవనాన్ని గొప్పగా చెప్పుకోకుండా ఉండలేరు. ఢిల్లీలో త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల సంఖ్య 2014లో 5 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు అది 7.5 కోట్లకు చేరింది. భారత్ అభివృద్ధు ఆగదు. మూడోసారి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. అప్పుడు భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది.

ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ సమావేశాల టూరిజానికి ఊతమిస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సెంటర్ సెప్టెంబర్ లో జరిగే జీ20 సదస్సుకు వేదిక కానుంది. జీ20 ప్రారంభ వేడుకకు కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటుగా.. దాదాపు 3 వేల మందికి పైగా గెస్టులు హాజరయ్యే అవకాశం ఉంది. జీ20 సదస్సుకు ఆయా దేశాధినేతలు మాత్రమే కాకుండా.. విదేశీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానున్న కన్వెన్షన్ సెంటర్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఢిల్లీలో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టి ఈ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. అత్యాధునిక హంగులతో ఈ భారత్ మండపాన్ని రూపొందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి