iDreamPost

అకౌంట్‌లోకి రూ. 11 వేలు పొందే ఛాన్స్‌.. ఇంకా 2 రోజులే ఉంది త్వరపడండి!

  • Published Jul 11, 2023 | 8:29 AMUpdated Jul 11, 2023 | 8:29 AM
  • Published Jul 11, 2023 | 8:29 AMUpdated Jul 11, 2023 | 8:29 AM
అకౌంట్‌లోకి రూ. 11 వేలు పొందే ఛాన్స్‌.. ఇంకా 2 రోజులే ఉంది త్వరపడండి!

మీ బ్యాంక్‌ ఖాతాలో వెంటనే రూ. 11 వేల రూపాయలు పొందాలని భావిస్తున్నారా.. అయితే త్వరపడండి.. ఈ మొత్తం పొందడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతకు మీరు ఏం చేయాలి అంటే ఓ పోటీలో పాల్గొనాలి. దీనిలో మొదటి బహుమతి పొందిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.11 వేలు బహుమతిగా అందిస్తోంది. అందుకు మీరు ఏం చేయాలి… అసలు పోటీ ఏంటి.. దేని గురించి వంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..

అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. నగదు సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందిస్తోండగా.. కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరిటి రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ క్రమంలో అన్నదాతల కోసం ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. కోట్ల మంది రైతుల ఖాతాలో ప్రతి ఏటా విడతల వారీగా 6 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి అర్హులైన రైతులకు ప్రతి ఏటా 6 వేల రూపాయలు వారి ఖాతాలో మూడు విడతల్లో జమ అవుతున్నాయి. ఇప్పటికే 13 విడతల్లో 26 వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసింది ప్రభుత్వం. త్వరలోనే 14వ విడత నిధులు మంజూరు చేయనుంది.

అయితే కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేవలం 2 వేలు లేదంటే… ఏడాదికి 6 వేల రూపాయలు లభిస్తాయి కానీ 11 వేల రూపాయలు ఎలా వస్తాయి అంటే.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మై గౌ పీఎం కిసాన్‌ స్కీమ్‌కు సంబంధించి కొత్త లోగో డిజైన్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తోంది. దీనిలో విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేలు లభిస్తాయి. అలాగే కన్సోలేషన్‌ ప్రైజ్‌ కింద మరో ఇద్దరికి రూ. 5వేలు లభిస్తాయి. ఈ పోటీకి మరో రెండు రోజులు మాత్రమే అనగా ఈ నెల 13 వరకు మాత్రమే గడువు ఉంది. కనుక త్వరపడి.. మీ బుర్రకు పదును పెట్టి మంచి డిజైన్‌ పంపిస్తే.. మీకే బహుమతి రావచ్చు.

14వ విడత నిధులు మంజూరు అయితే.. ఈ పథకానికి అర్హులైన రైతుల ఇప్పటి వరకు 28 వేల రూపాయలు పొందినట్లు అవుతుంది. అయితే పీఎం కిసాన్‌ డబ్బులు పొందాలంటే.. కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. లేదంటే మీ అకౌంట్‌లో డబ్బులు పడవు. ఇందుకోసం మీరు కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉచితంగానే ఇకేవైసీ నమోదు పూర్తి చేయవచ్చు. లేదంటే దగ్గరలోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి