iDreamPost

రైతులకు కేంద్రం శుభవార్త.. కీలక ప్రకటన చేసిన మోదీ సర్కార్!

  • Author Soma Sekhar Published - 08:30 AM, Tue - 18 July 23
  • Author Soma Sekhar Published - 08:30 AM, Tue - 18 July 23
రైతులకు కేంద్రం శుభవార్త.. కీలక ప్రకటన చేసిన మోదీ సర్కార్!

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం అని అందరికి తెలిసిందే. దేశంలో ఎంతో మంది రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని తమ జీవితాలను వెళ్లదీస్తున్నారు. అలాంటి అన్నదాతల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొస్తూనే ఉన్నాయి. అయితే ఆ పథకాల గురించిన సమాచారం రైతులకు అందడం లేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు తీపికబురు చెప్పింది మోదీ సర్కార్. దీని వల్ల దేశంలోని కొన్ని కోట్ల మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎప్పుడు జమ చేసేది వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం అర్హులు అయిన రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు వేల రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈసారి మాత్రం ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. ఈ విషయంపై కీలక ప్రకటన చేసింది మోదీ సర్కార్. అన్నదాతల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో చెప్పింది. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు జూలై 28న అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. మోదీ సర్కార్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. దాంతో రైతులకు ఊరట కలగనుంది.

ఇక ఈ స్కీమ్ కింద దేశంలోని సుమారు 8.5 కోట్ల మందికి లబ్ది చేకూరుతోంది. 14వ విడత డబ్బులను జూలై 28న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.26వేలను అన్నదాతలకు అందించింది. 14వ విడత డబ్బులు జమ అయితే రైతుల ఖాతాల్లో మెుత్తంగా రూ.28 వేలు జమ అవుతాయి.

ఇదికూడా చదవండి: విషాదం: మాజీ సీఎం కన్నుమూత!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి