iDreamPost

కేంద్ర ప్రభుత్వ అద్భుత స్కీమ్.. రైతులు ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు!

PM Kisan Mandhan Yojana: ఏ ప్రభుత్వం అయినా సరే అట్టడుగు వర్గాల ప్రజలకు లబ్ది చేకూరే వేధంగా కొన్ని విధానాలను రూపొందిస్తారు. అందులో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. అలానే రైతుల కోసం కూడా అలాంటి ఓ అద్భుతమైన స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

PM Kisan Mandhan Yojana: ఏ ప్రభుత్వం అయినా సరే అట్టడుగు వర్గాల ప్రజలకు లబ్ది చేకూరే వేధంగా కొన్ని విధానాలను రూపొందిస్తారు. అందులో కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. అలానే రైతుల కోసం కూడా అలాంటి ఓ అద్భుతమైన స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వ అద్భుత స్కీమ్.. రైతులు ప్రతి నెలా రూ.3వేలు పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఏదో ఒక  స్కీమ్ ను ప్రారంభించింది. అలానే దేశానికి వెన్నెముక అయినా  రైతుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చింది. అయితే చాలా మంది రైతులకు తమకు ఉపయోగపడే పథకాలు చాలా ఉన్నాయని తెలియదు. రైతులు కష్టపడి శ్రమించి..వృద్ధాప్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్రం ఓ పథకం తీసుకొచ్చింది. ఆస్కీమ్ ద్వారా రైతు ప్రతి నెల రూ.3 వేల పొందవచ్చు. మరి.. ఆ స్కీమ్ ఏమిటి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న సరే బడుగు బలహీన వర్గాలకు లబ్ది చేకూరే వేధంగా సంక్షేమ పథకాలు ప్రారంభిస్తుంది. అందులోనూ రైతలును, నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పుడు  ప్రధాన మంత్రి కిషాన్ మన్ ధన్ అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం ద్వారా రైతులకు మంచి ఆర్థిక భరోసా చేకూరుతుందని చెబుతున్నారు. ఇందులో ప్లాన్ కింద నెలకు 55 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 60 ఏళ్ల పెట్టుబడి తర్వాత, మీరు నెలకు రూ. 3 వేలు పొందుతారు.

ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ పథకం పూర్తిగా పేద రైతుల కోసం ప్రభుత్వం ప్రారంభించింది.  ఈ పథకంలో చేరేందుకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు అర్హులు. ఆ రైతులే ఈ పథకం కింద దరశాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం తాత్కాలికంగా లాభం ఇవ్వకపోయినా.. వృద్ధాప్యంలో రైతులు ఆనందంగా జీవించేందుకు ఉపయోగడుతుంది. ఈ పీఎం కిసాన్ మన్ ధన్ స్కీమ్ రైతులకు వృద్ధాప్యంలో పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా ఇవ్వనుంది ఈ పథకం. కారణం రేయింబవళ్లు కష్టపడి వ్యవసాయం చేసి..పిల్లలను పెంచిపెద్ద చేస్తే.. వృద్దాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు వృద్దాప్యంలో నరకం అనుభవిస్తున్నారు. అందుకే అలాంటి తల్లిదండ్రుల కోసం ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ ప్లాన్ లో పెట్టుబడి రూపంలో డబ్బులు పెడితే .. వృద్ధాప్యంలో వాటిని పింఛన్ రూపంలో పొందవచ్చు.

మరి.. నెలకు మూడు వేలు పొందాలంటే.. అర్హులైన రైతులు వారి వారి వయస్సును బట్టి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే నెలకు రూ.55 రూపాయలు ఉంటుంది. అదే 30 ఏళ్ల తర్వాత వారు అయితే రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 40 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే రూ.220 పెట్టుబడిగా ఉంటుందని చెబుతున్నారు. ఇది అమౌంట్ అనేది నెలకు మాత్రమే. అలా కడుతున్న సమయంలో మీకు ఎప్పుడైతే 60 ఏళ్లు నిండుతాయో.. ప్రతినెలకు రూ.3వేలు ఇస్తారు. ఇది సదరు లబ్ధిదారులు బతికి ఉన్నంత కాలం వర్తిస్తుంది. ఇలా ప్రతి నెల రూ.3వేల అంటే.. ఒక్క ఏడాదికి రూ.36వేల వరకు అర్హుడైన వ్యక్తి అకౌంట్ లోకి మాట. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ లో చూడవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి