iDreamPost

బాబ్బాబు.. వదిలేయండి.. టీడీపీ వేడుకోలు..

బాబ్బాబు.. వదిలేయండి.. టీడీపీ వేడుకోలు..

సాధారణ ఎన్నికల్లో బలమైన ఎంపీ అభ్యర్థులు లేక సతమతమైన టీడీపీ.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సమస్యను ఎదుర్కొంటోందని ఆ పార్టీ నేతల మాటలను బట్టి తెలుస్తోంది. బలమైన నేతలు, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులు అని టీడీపీ అనుకుంటున్న వారిని వైఎస్సార్‌సీపీ లాక్కుంటోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు వాపోతున్నారు.

స్థానిక సంస్థల్లో తమ అభ్యర్థులనుకుంటున్న సతీష్‌రెడ్డి, కదిరిబాబూరావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్‌లతోపాటు కృష్ణ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థులను చేర్చుకునేందకు వైఎస్సార్‌సీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టిందని అశోక్‌బాబు చెప్పుకొస్తున్నారు. గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సీటు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కుమార్తెకు ఇస్తామని చెప్పి.. ఆయన్ను పార్టీలోకి చేర్చుకున్నారని పేర్కొంటున్నారు.

ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలుస్తామని చెప్పిన అశోక్‌బాబు.. ఓటమి భయంతోనే తమ పార్టీ వారిని వైఎస్సార్‌సీపీ చేర్చుకుంటోందని చెప్పుకొస్తున్నారు. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి తమ పార్టీ నేతలను వైఎస్సార్‌సీపీ లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలసల్ని ప్రోత్సహించబోమని చెప్పిన జగన్‌.. ఇలా చేస్తుండడం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ను విరమించుకోవాలంటూ ఆయన కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి