iDreamPost

గుజరాత్‌తో మ్యాచ్‌ తర్వాత ఎమోషనలైన కోహ్లీ! ఆత్మగౌరవం కోసం..

  • Published Apr 29, 2024 | 11:12 AMUpdated Apr 29, 2024 | 11:12 AM

Virat Kohli, RCB vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, RCB vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 29, 2024 | 11:12 AMUpdated Apr 29, 2024 | 11:12 AM
గుజరాత్‌తో మ్యాచ్‌ తర్వాత ఎమోషనలైన కోహ్లీ! ఆత్మగౌరవం కోసం..

ఈ సీజన్‌లో మొట్టమొదటి సారి ఆర్సీబీ తమ స్థాయి ప్రదర్శన చేసింది. ఆదివారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న గుజరాత్‌ను ఆర్సీబీ బౌలర్లను 200 పరుగులకే కట్టడి చేశాడు. మొట్టమొదటి సారి.. ఈ సీజన్‌లో ఆర్సీబీ టాపార్డర్‌ మొత్తం ఫామ్‌లోకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే.. కేవలం ఆర్సీబీ టాపార్డర్‌ బ్యాటర్లు.. విరాట్‌ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్‌, విల్‌ జాక్స్‌.. కలిసి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీని గెలిపించారు. కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి.. ఆర్సీబీ 200 ప్లస్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేసింది. ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత కోహ్లీ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

తన స్ట్రైక్‌ రేట్‌తో పాటు స్పిన్నర్లు సరిగా ఆడలేకపోతున్నాడు అని వస్తున్న విమర్శలకు చెప్పచెల్లుమనిపించేలా కౌంటర్‌ ఇచ్చాడు. దాంతో పాటే.. ఈ సీజన్‌లో తాము ఆత్మగౌరవం కోసం ఆడుతున్నాం అంటూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. గుజరాత్‌పై విజయం తర్వాత మాట్లాడిన కోహ్లీ..‘మన కోసం మనం ముందడుగు వేయాలని, మా ఆత్మగౌరవం కోసం ఆడాలని అనుకున్నాం. టోర్నమెంట్ ఫస్టాఫ్‌లో మేం అనుకున్న విధంగా ఆడలేదు, కానీ, ఇప్పుడు మా బౌలర్లు బాగా రాణిస్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు, అలాగే ఫీల్డర్లు కూడా మెరుగ్గా ఫీల్డింగ్‌ చేస్తున్నారు. ఈ విధంగానే మేము ఆడాలని అనుకున్నాం. గత రెండు మ్యాచ్‌ల్లో తప్ప.. మేం మా స్థాయికి తగ్గ ఆట ఆడలేదు. అయితే.. ఈ గేమ్‌ను మేం కొనసాగించాలని అనుకుంటున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మాకు అద్భుతమైన వాతావరణం ఉంది. మేం ఇప్పుడు మా కోసం ఆడాలని అనుకుంటున్నాం. మా ఫ్యాన్స్‌ నుంచి లభిస్తున్న మద్దతుకు.. మాకు కొంత ఆత్మగౌరవం ఉండాలి’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ఒక్క ట్రోఫీ కూడా లేకపోయినా.. ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌ఫ్యాక్ట్‌.. అన్ని టీమ్స్‌ కంటే ఎక్కువ అభిమానులు ఆర్సీబీకే ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు 16 ఐపీఎల్‌ సీజన్స్‌ ముగిశాయి కానీ, ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. కోహ్లీ లాంటి సూపర్‌ స్టార్‌ క్రికెట్‌ ఆ టీమ్‌లో ఉండటంతోనే ఆర్సీబీకి అంత క్రేజ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, కోహ్లీ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. ఈ సీజన్‌లో కూడా కప్పు కష్టమే. అయినా కూడా ఆర్సీబీకి ఏ మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు. దీంతో.. కనీసం అభిమానుల కోసమైనా.. కప్పు కొట్టాలి, అది సాధ్యం కాకపోయినా.. కనీసం దారుణంగా ఓడిపోతూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కాకుండా అభిమానుల గౌరవార్థం కనీసం మెరుగైన పొజిషన్‌లో ఉండాలని కోహ్లీ భావిస్తున్నట్లు అతని మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి