iDreamPost

గుడ్ న్యూస్: పేటీఎంలో రూ.70కే కిలో టమాటాలు.. ఇలా కొనేయండి!

గుడ్ న్యూస్: పేటీఎంలో రూ.70కే కిలో టమాటాలు.. ఇలా కొనేయండి!

ప్రస్తుతం టమాటాలు కూరగాయల్లోకెల్లా పెద్ద సెలబ్రిటీ అయిన విషయం తెలిసిందే. ఏం కూర అంటే టమాటా అని చెప్పారంటే.. ఇంక అంతే సంగతులు. మీరు రిచ్ పీపుల్ అని మీకు ట్యాగ్ తగిలించేస్తారు. మార్కెట్ లో కిలో టమాటా రేటు.. కిలో యాపిల్ కంటే ఎక్కువగా ఉందనే విషయం తెలుసుకుని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. టమాటాలు అమ్మేందుకు బౌన్సర్లు, టమాటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్లని కూడా చూస్తున్నాం. చాలా మంది అయితే టమాటాని కొనడం, తినడం మానేసి చాలా రోజులు అయింది. అలాంటి వారికి ఇది శుభవార్తనే చెప్పాలి.

దేశవ్యాప్తంగా టమాటాల రేటు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. కిలో టమాటాల ధర రూ.120 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. అందుకే చాలా మంది వాటిని కొనడం మానేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రం సబ్సిడీలో టమాటాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ కొనాలంటే క్యూలో నిల్చోవడం అందరి వల్ల అయ్యేది కాదు. అలాంటి వాళ్లు ఎంచక్కా పేటీఎంలో టమాటాలు కొనేయచ్చు. అది కూడా కిలీ రూ.70 మాత్రమే. అవునండి బాబు.. జోక్స్ వేయడానికి ఇదేం ఏప్రియల్ కాదు కదా. అందుకే నిజంగానే నిజం చెప్తున్నాం. పేటీఎంలో ఇటీవల కేంద్రం ONDC సర్వీస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో వ్యాపారస్తులు నేరుగా ఒక బిజినెస్ పార్టనర్ గా చేరచ్చు. అక్కడ వారి ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఓఎన్డీసీ సర్వీసెస్ హైదరాద్, ఢిల్లీ, ముంబయి, కలకత్తా, చెన్నై, కాంచీపురం, లక్నో, బాగల్ కోట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసెస్ లో ఫుడ్, బేవరేజెస్, గ్రాసెరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, కిచెన్, హెల్త్, పర్సనల్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్ ని డెలివర్ చేస్తున్నారు. ఈ ఓఎన్డీసీలోనే మీరు కిలో టమాటాలు రూ.70కి కొనుగోలు చేయచ్చు. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. ఒక యూజర్ వారంలో కేవలం రెండు కిలోలు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది. అంటే వారంలో మీరు టమాటాలు రూ.140కి మించి కొనలేరు అనమాట. నిజానికి వారానికి 2 కిలోల టమాటాలకు మించి ఎవరూ వాడకపోవచ్చు. అయితే ఈ టమాటాలు హైదారాబాద్ లో అయితే అందుబాటులో ఉన్నట్లుగా లేవు. హైదరాబాద్ నగరవాసులను ఇది కాస్త అసహనానికి గురి చేస్తోంది. అయితే పేటీఎంలో టమాటాలు ఎలా కొనుగోలు చేయాలో.. స్టెప్ బై స్టెప్ చూడండి.

  • ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి.
  • సెర్చ్ బార్ లో ONDC అని సెర్చ్ చేయాలి.
  • ONDC ఫుడ్ పేజ్ లో “Tomatoes From NCCF” మీద క్లిక్ చేయాలి.
  • మీకు ఎన్ని టమాటాలు కావాలో సెలక్ట్ చేసుకోవాలి.
  • టమాటాలు ఎక్కడికి డెలివర్ చేయాలో అడ్రస్ ఎంటర్ చేయాలి.
  • పేమెంట్ ఎలా చేయాలి అనుకుంటున్నారో సెలక్ట్ చేసుకుని.. మనీ కట్టేయాలి.
  • మీ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి