iDreamPost

Pawan Kalyan: జనసేన పొలిటికల్ యాడ్.. పిచ్చ కామెడీ చేసిన పవన్!

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. పవన్ కల్యాణ్ ను హైలెట్ చేస్తూ రూపొందించిన ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. పవన్ కల్యాణ్ ను హైలెట్ చేస్తూ రూపొందించిన ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Pawan Kalyan: జనసేన పొలిటికల్ యాడ్.. పిచ్చ కామెడీ చేసిన పవన్!

సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే.. రాజకీయ పార్టీలు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రచారాలు చేస్తుంటాయి. ఇంకా సోషల్ మీడియా, టీవీలు,పేపర్లలో ప్రకటనలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలానే కొన్ని పార్టీలు తమ యాడ్ ను రూపొందించి.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని సార్లు కామెడీగా మారుతాయి. తాజాగా జనసేన ఆవిర్భవ సందర్భంగా విడుదలైన ఆ పార్టీ పొలిటికల్ యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి. ఈ యాడ్ లో పవన్ పిచ్చ కామెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలకు ఉన్న ప్రధాన ఆయుధాలు సభలు, ప్రచారం, ప్రకటనలు.పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అవుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ  ఆవిర్భవ సందర్భంగా ఓ యాడ్ ను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్  చేసింది. ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ యాడ్ చూసినట్లు అయితే ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను “గాజు గ్లాసు” తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి.

జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ గుర్తు ఉన్న వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందని సింబాలిక్‌గా తెలిపిలే.. ఫ్యాన్ స్విచ్ ఆన్  ఆన్ చేస్తారు. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ వచ్చి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి.. నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన పేపర్లను  తీసి టేబుల్ మీద సర్దుతారు. ఆ పేపర్లపై “గాజు గ్లాసు” ఉంచుతారు. రాష్ట్రాభివృద్ధిని తాము చక్కదిద్దుతామనే విషయాన్ని పార్టీల సింబల్ ద్వారా ఇలా తెలియజెప్పేందు ప్రయత్నం చేశారు.

ఇక వీడియో చివర్లో సీఎం కుర్చీని పట్టుకుని.. పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతారు. కానీ అందులో కూర్చోరు. అంటే ముఖ్యమంత్రిగా టీడీపీ బాధ్యతలు చేపడితే.. తమ సహకారం అందిస్తామనే విషయాన్ని జనసేన ఈ యాడ్ ద్వారా తెలియజేసిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈవీడియోలో పవన్ పిచ్చ కామెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పవన్ కల్యాణ్ కు ఉన్న కేడర్ కి, ఆయన యాడ్ లో చూపించుకున్న బిల్డప్ సంబంధం లేదు. 21 సీట్లు తీసుకున్న వ్యక్తి.. అందులోనూ సరిగ్గా తన అభ్యర్థులు పెట్టుకోలేని వ్యక్తి రాష్ట్రంలోని అన్ని రంగాలను గాడీలో పెడతాననడం హాస్యాస్పందంగా ఉంది.

ఇలా పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి ఊహాల్లో తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటారని, కానీ రియాల్టీకి వచ్చే సరికి పూర్తిగా భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏనాడు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయకుండా.. తనను తాను ఓ పెద్ద శక్తిలా ఊహించుకున్నారు. అలానే పొత్తులో భాగంగా సీట్లు ప్రకటించే ముందు వరకు అలానే గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు. జనసేన శ్రేణులు కూడా తమ పార్టీ  ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని ఊహించుకున్నారు. చివరకు పవన్ చెప్పిన మాటలకు తీసుకున్న సీట్లకు సంబంధం లేకుండా పోయింది. ఇలా కేవలం సీట్ల విషయంలోనే కాకుండా అనేక విషయంలో పవన్ అదే తీరులో ఉంటారు. ప్రస్తుతం యాడ్ లో పవన్ కి ఇచ్చిన బిల్డప్, క్షేత్ర స్థాయిలో ఆయన చేస్తున్న పనులకు పోలికే లేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా పవన్ కామెడీ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి