iDreamPost

పవన్ పై విజయవాడ కోర్టులో కేసు.. ఎందుకంటే!

పవన్ పై విజయవాడ కోర్టులో కేసు.. ఎందుకంటే!

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత కోర్టులు సైతం వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించిన కేసుల విషయంలో ఎటువంటి తీర్పు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. అలానే ఇతర కేసుల్లో నారా లోకేశ్, పి నారాయణ వంటి నేతలు కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఎప్పుడు ఏ నేత జైలుకు వెళ్తాడో అనే ఉత్కంఠ  ఏపీలో కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. మరి.. ఈ కేసులో ఏ తీర్పు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. మరి.. ఆ కేసు ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గతంలో పవన్ కల్యాణ్ వాలంటీర్లపై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. వారు మానవ అక్రమ రవాణాకు పాల్పాడుతున్నారని, వారి కారణంగానే హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ ఘటనలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  అంతేకాక వాలంటీర్లను వ్య‌క్తిగ‌తంగా దూషించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లుగా ప‌ని చేస్తున్న వారంతా పవన్ పై నిప్పులు చెరిగారు. వెంట‌నే బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్ కళ్యాణ్ దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేశారు. త‌మ‌కు ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున స‌హ‌కారం అందిస్తోంద‌ని, అలానే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్న తమపైనే అనుచిత వ్యాఖ్య‌లు ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు. అంతేకాక త‌మ‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూషించడాన్ని స‌వాల్ చేస్తూ కోర్టుకు ఎక్కారు.

అయితే  కోర్టు సరైన ఆధారాలతో రమ్మని తిప్పి పంపింది. దీంతో తాజాగా మరోసారి వాలంటీర్లు కోర్టు మెట్లు ఎక్కారు.  దీంతో పీడీఎం విజయవాడ కోర్టు కేసును విచారణకు స్వీకరించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి శుక్ర‌వారం విజ‌య‌వాడ కోర్టులో విచార‌ణ‌కు రానుంది. ఎలాంటి తీర్పు వెలువ‌డుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది జ‌న‌సేన పార్టీ కార్యకర్తలతో పాటు అందరిలో ఆసక్తి నెలకొంది. వాలంటీర్లు గ్రామ స‌చివాల‌యాల్లో బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు విస్తృత‌మైన సేవ‌లు అంద‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నది వాలంటీర్లే. అలాంటి వారిపై పవన్ వివాదస్పంద వ్యాఖ్యలు చేశారు. మరి.. పవన్ కేసు కోర్టులో విచారణకు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి