iDreamPost

ఆ విషయంలో కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తున్నపవన్!

ఇటీవల ఓ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తున్నాయని పొటిలికల్ సర్కిల్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సీఎం అయితే చూడాలనుకున్న ఆయన కార్యకర్తలకు రోజూకో మాట చెబుతూ చిరాకు తెప్పిస్తున్నారంట.

ఇటీవల ఓ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తున్నాయని పొటిలికల్ సర్కిల్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సీఎం అయితే చూడాలనుకున్న ఆయన కార్యకర్తలకు రోజూకో మాట చెబుతూ చిరాకు తెప్పిస్తున్నారంట.

ఆ విషయంలో కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తున్నపవన్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి  హీరోగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయి క్రేజ్ లేదని, కారణం.. సినిమాలను, రాజకీయలను ఒకేలా చూస్తాడని టాక్. అందుకు తగినట్లే పాలిటిక్స్ లో  పవన్ కల్యాణ్ తీరు ఉంటుంది. ఎప్పుటు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన ఏం మాట్లాడిన జనసైనికులు పవన్ కే సపోర్టు గా ఉంటారు. కానీ ఇటీవల సీఎం పదవి విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తున్నాయని పొటిలికల్ సర్కిల్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సీఎం అయితే చూడాలనుకున్న ఆయన కార్యకర్తలకు రోజూ కో మాట చెబుతు చిరాకు తెప్పిస్తున్నారంట.

జనసేన అధినేత పవన్ కల్యాణ్..దాదాపు 10 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారు. ఇన్నేళ్లు గడిచిన పవన్ లో రాజకీయ పరిజ్ఞానం లేదని చాలా మంది అంటారు. కారణం పార్టీ  పెట్టి పదేళ్ల కాలంలో ఏనాడు పవన్ కల్యాణ్ ఒక్కమాట మీద నిలబడలేదనేది చాలా మంది అభిప్రాయం. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతుగా నిలిచారు. 2019 ఒంటరిగా పోటీ చేశారు. తాజాగా 2024లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇలా టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వరకు రాజకీయ వ్యూహం అని జనసేన కార్యకర్తలు ఆమోదిస్తారు. కానీ టీడీపీని గెలిపించడం, చంద్రబాబును సీఎం చేయడం మాత్రం తన జీవితాశయం అన్నట్లు పవన్ కల్యాణ్ మాట్లాడితే అభిమానులకు చిరాకు కలుగుతుందని టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబును సీఎం చేయడం పవన్ లక్ష్యం అయితే.. కేవలం పవన్ మాత్రమే కష్టపడితే సరిపోతుందని కొందరి అభిప్రాయం. పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న తమ కష్టాన్ని తీసుకెళ్లి.. బాబు మీద ధారపోయాలని అనుకోవడం ఏ రకంగా కరెక్టు అనే వాదనలు అభిమాన్లులో వినిపిస్తోన్నాయి. సీఎం సీటు కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం.. అందుకే మనం టీడీపీతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ చెప్పడం కార్యకర్తలకు మరోలా ధ్వనిస్తుంది. మరోసారి అవకాశం వస్తే తాను సీఎం సీటు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెబుతాడు.  తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవి కన్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ముఖ్యమని, వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో  సీఎం పదవి వస్తే  స్వీకరిస్తా.

సీఎం పదవికి విముఖంగా లేను అంటూ కీలక కామెంట్స్ చేశారు. ఇలా పవన్ కల్యాణ్ రోజుకో మాట చెప్పడం నిజమైన కార్యకర్తల్లో చిరాకు తెప్పిస్తుందని టాక్ వినిపిస్తోంది. 90 శాతం మంది జనసైనికులు పవన్ కల్యాణ్ ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. 10 శాతం మంది మాత్రమే జనసేన ముసుగులో ఉండి…టీడీపీతో పొత్తు పెట్టుకుని పదవులు అనుభవించాలనే కోరికతో ఉన్నట్లు రాజకీయ విశ్లేషలకు అంటున్నారు. పది శాతం మంది మాయలో పడి పవన్ కల్యాణ్ సీఎం పదవిపై రోజుకో మాట మాట్లాడటం.. కార్యకర్తలకు చిరాకు పుట్టిస్తుందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి