iDreamPost

ముంబై అగ్ని ప్రమాద ఘటన.. క్రికెటర్ కుటుంబ సభ్యుల సజీవ దహనం!

  • Author Soma Sekhar Published - 04:57 PM, Tue - 24 October 23

ముంబైలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం ఐపీఎల్ స్టార్, మాజీ క్రికెటర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని క్రికెటర్ సోదరితో పాటుగా ఆమె 8 ఏళ్ల కుమారుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ముంబైలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం ఐపీఎల్ స్టార్, మాజీ క్రికెటర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని క్రికెటర్ సోదరితో పాటుగా ఆమె 8 ఏళ్ల కుమారుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

  • Author Soma Sekhar Published - 04:57 PM, Tue - 24 October 23
ముంబై అగ్ని ప్రమాద ఘటన.. క్రికెటర్ కుటుంబ సభ్యుల సజీవ దహనం!

ముంబైలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదం ఐపీఎల్ స్టార్, మాజీ క్రికెటర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు యూకే నుంచి ముంబై వచ్చింది క్రికెటర్ సోదరి కుటుంబం. అయితే ఊహించని విధంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకుని క్రికెటర్ సోదరితో పాటుగా ఆమె 8 ఏళ్ల కుమారుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే ప్రమాద సమయంలో భార్యా, పిల్లలను కాపాడుకున్న అతడు, తన సోదరిని, మేనల్లుడిని కాపాడేందకు తీవ్రంగా ప్రయత్నించాడు.. కానీ వారిని మాత్రం కాపాడుకోలేకపోయాడు. తన కళ్ల ముందే సొదరితో పాటు మేనల్లుడు మంటల్లో కాలిపోతుంటే ఏమీ చేయలేకపోయాడు.

దేశం మెుత్తం వరల్డ్ కప్, దసరా వేడుకల్లో మునిగిపోతే.. ఓ స్టార్ క్రికెటర్ ఇంట్లో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఐపీఎల్ మాజీ క్రికెటర్ పాల్ వాల్తాటి తన సోదరిని, మేనల్లుడిని కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలో కాండివ్లిలో ఓ భవనంలో ఎనిమిదో అంతస్తులో సోమవారం మధ్యాహ్నాం మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరణించిన వారు ఐపీఎల్ మాజీ క్రికెటర్ పాల్ వాల్తాటి సోదరి గ్లోరీ రాబర్ట్స్, ఆమె 8 ఏళ్ల కుమారుడు జోషువా.

కాగా.. ఘటన సమయంలో సహాయాక సిబ్బంది మంటలను ఆర్పివేసి.. లోపలికి వెళ్లి చూడగా.. తీవ్రగాయాలతో గ్లోరీ, జాషువా కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించాగా.. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు చెప్పారు. కాగా గ్లోరీ తన తల్లి అనారోగ్యంగా ఉందని చూడటానికి యూకే నుంచి వచ్చింది. కానీ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అదీకాక వాల్తాటి తల్లికి సహాయపడేందుకు వచ్చిన ఇద్దరు నర్సులు కూడా తీవ్రగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన పాల్ వాల్తాటి భార్యా, పిల్లలు, గ్లోరీ పెద్ద కుమార్తెను మెట్ల ద్వారా బయటకి పంపాడు. సోదరిని, మేనల్లుడిని తీసుకొద్దానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. మంటలు ఎగిసిపడటంతో.. వారిని కోల్పోవాల్సి వచ్చింది. ఇక పాల్ వాల్తాటి గతంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం అతడు తన కుటుంబంతో కలిసి ముంబైలోనే ఉంటున్నాడు. ఈ విషాద సంఘటన గురించి తెలిసిన పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి