iDreamPost

World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిపోతామని పాకిస్థాన్‌కు ముందు తెలుసా?

  • Published Oct 24, 2023 | 4:46 PMUpdated Oct 24, 2023 | 4:46 PM

చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్‌ ఎంతో అద్భుతంగా ఆడి పాక్‌ను ఓడించింది. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్‌ గురించి ఓ ఆసక్తి విషయం వెలుగులోని వచ్చింది. ఈ ఓటమిని పాక్‌ ముందే ఊహించిందని తెలుస్తుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్‌ ఎంతో అద్భుతంగా ఆడి పాక్‌ను ఓడించింది. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్‌ గురించి ఓ ఆసక్తి విషయం వెలుగులోని వచ్చింది. ఈ ఓటమిని పాక్‌ ముందే ఊహించిందని తెలుస్తుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Oct 24, 2023 | 4:46 PMUpdated Oct 24, 2023 | 4:46 PM
World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌పై ఓడిపోతామని పాకిస్థాన్‌కు ముందు తెలుసా?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో మూడో సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్‌ తొలుత ఇంగ్లండ్‌ను ఓడించి.. ఈ వరల్డ్‌ కప్‌లో తొలి అప్‌సెట్‌ సృష్టిస్తే.. ఆ వెంటనే దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఓడించి మరో సంచలనం సృష్టించింది. తాజాగా సోమవారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది ఆఫ్ఘనిస్థాన్‌. ఇప్పటికే వరుసగా ఇండియా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్థాన్‌.. ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో కూడా ఓడిపోవడం సంచలనంగా మారింది. పైగా ఇదేదో లక్‌లో విజయం కూడా కాదు.. ఆఫ్ఘనిస్థాన్‌ ఎంతో అద్భుతంగా ఆడి పాక్‌ను ఓడించింది. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్‌ గురించి ఓ ఆసక్తి విషయం వెలుగులోని వచ్చింది. ఈ ఓటమిని పాక్‌ ముందే ఊహించిందని, అందుకే ఆఫ్ఘాన్‌ చేతిలో ఎలాగో ఓడిపోతామని ముందే ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుంది.

అందుకు కారణం ఏంటంటే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు.. ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిలింగ్‌)కు ఓ రిక్వెస్ట్‌ చేసింది. అదేంటంటే.. చెన్నైతో వేదిక ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌, అలాగే బెంగళూరులోని ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ల వేదికలు మార్చాలని కోరింది. ముఖ్యంగా చెన్నై వేదికను మార్చి, బెంగళూరులో మ్యాచ్‌ పెట్టాలని కోరింది. కానీ, పీసీబీ రిక్వెస్ట్‌ను ఐసీసీ ఒప్పుకోలేదు. అల్రెడీ షెడ్యూల్‌ అంతా పూర్తి అయిందని, అయినా సరైన కారణం లేకుండా మ్యాచ్‌ వేదికల్లో మార్పు చేయడం కుదరదంటూ పేర్కొంది. దీంతో పాకిస్థాన్‌ టీమ్‌ చేసేందేం లేక ముందుగా నిర్ణయించిన వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

అయితే.. పాకిస్థాన్‌ ముందుగా భయపడుతున్నట్లే ఫలితాలు వచ్చాయి. బెంగళూరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి, మంచి స్పిన్‌ ఎటాన్‌ ఉన్న పసికూన ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఓటమి ఎదురైంది. పెద్దగా స్పిన్‌ ఎటాక్ లేని ఆసీస్‌తో చెన్నైలో ఆడినా, ఆఫ్ఘాన్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్‌ మ్యాచ్‌లు ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పాక్‌ క్రికెట్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తూ.. ముందుగా ఐసీసీని రిక్వెస్ట్‌ చేసింది. కానీ, ఐసీసీ ఒప్పుకోకపోవడంతో పాక్‌ ముందుగానే ఈ రెండు మ్యాచ్‌ల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించింది. అనుకున్నట్లే ఓటమి వెక్కిరించింది. చెన్నై చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే ఆఫ్ఘాన్‌ ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి.. మ్యాచ్‌ గెలిచింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: పాక్‌ ఓటమి.. రషీద్‌ ఖాన్‌తో కలిసి డాన్స్‌ వేసిన టీమిండియా క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి