iDreamPost

పఠాన్ వివాదంలో సెన్సార్ బోర్డు జోక్యం

పఠాన్ వివాదంలో సెన్సార్ బోర్డు జోక్యం

మామూలుగా వివాదాస్పద సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే. నలభై ఏళ్ళ క్రితం బొబ్బిలి పులికి సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తే ఎన్టీఆర్, దాసరి నారాయణరావులు ఢిల్లీ దాకా వెళ్లి పోరాడి క్లియరెన్స్ తెచ్చుకుని రిలీజ్ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఆర్ నారాయణమూర్తి దర్శకుడిగా తొలి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రానికి ఇలాగే జరిగితే నటులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సహాయంతో దీని మీద పీపుల్స్ స్టార్ పెద్ద పోరాటమే చేశారు. చివరికి థియేటర్లలో అడుగు పెట్టాక పోలీసుల నిఘాలో షోలు వేయాల్సి వచ్చేది. ఎవరైనా నక్సలైట్లు వస్తారేమోనని మఫ్టీలో వేయి కళ్ళేసుకుని వెతికేవారు.

ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడలాంటి పరిస్థితి పఠాన్ కు వచ్చింది. షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ జనవరి 25 భారీ ఎత్తున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ సంస్థ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. అయితే మొదటి పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు దీపికా పదుకునే ఓవర్ ఎక్స్ పోజింగ్ విపరీతమైన విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా కాషాయం రంగులో ఉండే బికినీలు స్విమ్ సూట్లు వేసుకుని అంగాంగ ప్రదర్శన చేసిందంటూ హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో సెన్సార్ బోర్డు రంగంలోకి దిగినట్టుగా ముంబై మీడియా టాక్

ఆ డ్రెస్ ని మార్చాలని దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. సాధారణంగా సినిమ కంటెంట్ మీద అబ్జెక్షన్ చెప్పే అధికారులు ఈసారి హీరోయిన్ దుస్తుల మీద అభ్యంతరం వ్యక్తం చేయడం చాలా అరుదు. నిజానికి ఇంతకు మించి అంగాంగ ప్రదర్శనలు, స్కిన్ షోలు గతంలో స్టార్ హీరోల సినిమాల్లో బోలెడు వచ్చాయి. కానీ పఠాన్ కేసులో మాత్రమే ఇవి మనోభావాలు దెబ్బ తినే స్థాయి దాకా వెళ్లాయి. మరి పఠాన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన ఈ పాటను తీసేయడమన్నా రీ షూట్ చేయడమన్నా ఒకరకంగా సూసైడ్ లాంటిది. యష్ అధినేతలు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి