iDreamPost

తెలుగులో రీమేక్ కానున్న పంచాయత్ సీరీస్

  • Published Mar 21, 2024 | 1:33 PMUpdated Mar 21, 2024 | 1:33 PM

ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ సిరీస్ లలో ఒకటి పంచాయత్‌. గ్రామ పంచాయతీ బ్యాక్ డ్రాప్ లో అక్కడ పనులు జరిగే తీరు, ప్రభుత్వ అధికారి అయిన హీరోకి ఎదురయ్యే అనుభవాలతో తెరకెక్కి మంచి ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుందని అంటున్నారు.

ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ సిరీస్ లలో ఒకటి పంచాయత్‌. గ్రామ పంచాయతీ బ్యాక్ డ్రాప్ లో అక్కడ పనులు జరిగే తీరు, ప్రభుత్వ అధికారి అయిన హీరోకి ఎదురయ్యే అనుభవాలతో తెరకెక్కి మంచి ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుందని అంటున్నారు.

  • Published Mar 21, 2024 | 1:33 PMUpdated Mar 21, 2024 | 1:33 PM
తెలుగులో రీమేక్ కానున్న పంచాయత్ సీరీస్

ప్రస్తుతం ఓటీటీ యుగంలో రీమేక్ లకు దాదాపు కాలం చెల్లిందనే చెప్పాలి. కోవిడ్ సమయంలో భారతదేశంలో ఓటీటీ మార్కెట్ బాగా పెరిగింది. దాంతో అప్పటి దాకా పెద్దగా ఇతర భాషల సినిమాలు చూడటం అలవాటు లేని ప్రేక్షకులకి అన్ని రకాల సినిమాలు చూడటం అలవాటు అయింది. ఈ కారణం వల్లే రీమేక్‌ల మార్కెట్‌ కు కోవిడ్‌కు ముందు ఉన్న క్రేజ్ కోవిడ్ తర్వాత తగ్గిపోయింది. తద్వారా రీమేక్ హక్కులను అమ్మడం ద్వారా నిర్మాతలు సంపాదించే అదనపు డబ్బు సంపాదించే అవకాశం కూడా దాదాపు లేకుండా పోయింది. తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లు కూడా రీమేక్‌ తీసి హిట్ కొట్టలేకపోయారు. హిందీలో అజయ్ దేవగణ్ తప్ప ఈరోజుల్లో రీమేక్ తో హిట్ కొట్టిన హీరో లేరనే చెప్పాలి. అలాంటి సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో తన సీరీస్ నే రీమేక్ చేయనుందనే వార్త నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ప్రైమ్ వీడియోలో బ్లాక్ బస్టర్ సిరీస్ లలో ఒకటి పంచాయత్‌. గ్రామ పంచాయతీ బ్యాక్ డ్రాప్ లో అక్కడ పనులు జరిగే తీరు, ప్రభుత్వ అధికారి అయిన హీరోకి ఎదురయ్యే అనుభవాలతో తెరకెక్కి మంచి ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుందని అంటున్నారు. నిజానికి ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సీరీస్ అన్ని అడ్డంకులను బద్దలు కొట్టి భాషతో సంబంధం లేకుండా తెలుగు మార్కెట్‌తో సహా ప్రతి భాషలో భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉంది. ఇప్పుడు, ప్రైమ్ వీడియో ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్ కు తెలుగు వెర్షన్‌ గా ‘శివరపల్లి’ సీరీస్ ను ప్రకటించింది. అసలు ఇంత పాపులర్ షోను రీమేక్ చేయడం ఏంటి? హిందీలో ఉన్న విలేజ్ ఫ్లేవర్, ఆ యాస క్రియేట్ చేసిన మ్యాజిక్ ఎలా రిపీట్ అవుతుంది? అని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Panchayat series to be remade in Telugu

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రీమేక్ ‘శివరపల్లి’ వెనుక ఒరిజినల్ పంచాయత్ సీరీస్ నిర్మించిన టీవీఎఫ్ (ది వైరల్ ఫీవర్) సంస్థ ఉండడమే. తెలుగు ఓటీటీ అభిమానులు ఓ పక్క పంచాయత్ సీజ‌న్ 3 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో ఈ తెలుగు రీమేక్ న్యూస్ బయటకి రావడం మ‌రింత విచిత్రమనే చెప్పాలి. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తీసిన కథనే మళ్ళీ తీయటం అందులోనూ ఇదివరకే బాగా పాపులర్ సీరీస్ అయిన పంచాయత్ సీరీస్ ను రీమేక్ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ప్రైమ్ వీడియో ఈ రీమేక్ ని ఎలా సక్సెస్ చేస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి