iDreamPost

పల్నాడు జిల్లాలో దారుణం.. YCP కార్యకర్త దారుణ హత్య

  • Published Oct 25, 2023 | 10:02 AMUpdated Dec 13, 2023 | 6:53 PM

వైసీపీ కార్యకర్త దారుణ హత్యతో గురజాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తోన్న వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. 

వైసీపీ కార్యకర్త దారుణ హత్యతో గురజాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తోన్న వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. 

  • Published Oct 25, 2023 | 10:02 AMUpdated Dec 13, 2023 | 6:53 PM
పల్నాడు జిల్లాలో దారుణం.. YCP కార్యకర్త దారుణ హత్య

పల్నాడు జిల్లాలో రాజకీయ కక్ష్యలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పల్నాడు జిల్లా, గురజాల సమీపంలోని జంగమహేశ్వరపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూనిరెడ్డి కృష్ణారెడ్డి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పని ముగించుకుని ఇంటికి వస్తోన్న సమయంలో మాటు వేసిన ప్రత్యర్థులు.. కత్తులతో అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా గురజాల ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్‌ కాలనీలో నివాసం ఉండే కృష్ణారెడ్డి పులిపాడులోని మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో విధులు ముగించుకుని.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఇక అదే రోజో దారిలో మాటువేసిన ప్రత్యర్థులు.. కృష్ణారెడ్డిపై కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణారెడ్డి.. అక్కడికక్కడే చనిపోయాడు. వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉంటున్న కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.

హత్య చేసింది టీడీపీ వర్గీయులే?

టీడీపీ వర్గీయులే కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారని అంటున్నారు. కొంతకాలం క్రితం టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య జరిగిన గొడవల కారణంగానే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణారెడ్డి హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంగళవారం నాడు.. కృష్ణారెడ్డి డెడ్‌బాడీని అతడి బంధువులకు అప్పగించారు.

ఈ హత్య కేసులో సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఎస్పీని కోరామని.. హత్య వెనుక ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి