iDreamPost

PSL 2024: పాకిస్థాన్ సూపర్ లీగ్ పని ఫినిష్​.. ఇక దాయాది దుకాణం మూసుకోవాల్సిందే!

  • Published Feb 13, 2024 | 9:14 PMUpdated Feb 13, 2024 | 9:14 PM

ఐపీఎల్ సక్సెస్​తో క్రికెట్​లో చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి పాకిస్థాన్ సూపర్ లీగ్. దాయాది దేశం ఈ లీగ్​ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

ఐపీఎల్ సక్సెస్​తో క్రికెట్​లో చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి పాకిస్థాన్ సూపర్ లీగ్. దాయాది దేశం ఈ లీగ్​ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

  • Published Feb 13, 2024 | 9:14 PMUpdated Feb 13, 2024 | 9:14 PM
PSL 2024: పాకిస్థాన్ సూపర్ లీగ్ పని ఫినిష్​.. ఇక దాయాది దుకాణం మూసుకోవాల్సిందే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ సక్సెస్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్​లో చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి. ప్రైవేటు లీగ్స్​తో పాటు క్రికెట్ బోర్డులు స్వయంగా నిర్వహించే లీగ్స్ కూడా ఉన్నాయి. తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు దాదాపుగా ప్రతి క్రికెటింగ్ నేషన్ ఓ లీగ్​ను రన్ చేస్తోంది. అలాంటి ఓ లీగే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్​ఎల్). దాయాది దేశ క్రికెట్ బోర్డు ఈ లీగ్​ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అయితే ఏదో ఒక వివాదంతో ఈ లీగ్​ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆ దేశ క్రికెట్ బోర్డులోని కొందరు పీఎస్​ఎల్​ను ఏకంగా ఐపీఎల్​తో పోల్చడం, క్యాష్​ రిచ్ లీగ్​ కంటే తమ లీగ్ గ్రేట్ అంటూ పలు వ్యాఖ్యలు చేయడం ఆ మధ్య హాస్యాస్యదమైంది. అయితే పీఎస్​ఎల్ తోపు, గొప్ప అంటూ బడాయికి పోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పనైపోయిందనే చెప్పాలి. పీఎస్​ఎల్ రన్ అవడం కష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అనేక దేశాల్లో టీ20 లీగ్స్ జరుగుతుండటంతో వీటిలో తమ ఆటగాళ్లు ఆడేందుకు పలు దేశాలు నిరాకరిస్తున్నాయి. క్రికెటర్లు ఇతర లీగ్స్​లో రెస్ట్ లేకుండా గడపడంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నీకి పలువురు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఎస్​ఏ20, ఇంటర్నేషనల్ టీ20 లీగ్​ల వల్ల అందుబాటులో లేక పీఎస్​ఎల్​లోని 6 టీమ్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు చెందిన పేసర్ రీసే టోప్లే గాయం వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పీఎస్ఎల్​​లో ఆడేందుకు అతడికి ఇంగ్లండ్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడం అతడు మధ్యలో నుంచి వెళ్లిపోవడానికి మరో కారణం. ముల్తాన్ జట్టులోని మరో ప్లేయర్ ఎహ్​సానుల్లా కూడా గాయపడ్డాడు. పెషావర్ జల్​మీ టీమ్​లో లుంగి ఎంగిడి, క్వెట్టా గ్లాడియేటర్స్​లో వనిందు హసరంగా ఇప్పటికే దూరమయ్యారు.

విండీస్‌ స్టార్లు షై హోప్, మాథ్యూ ఫోర్డే, అకియాల్ హోసేన్​తో పాటు సౌతాఫ్రికా ఆటగాళ్లు తబ్రేజ్ షంసీ, వాండర్ డస్సెన్, ఇంగ్లండ్ ప్లేయర్ జేమ్స్ విన్సీ, ఆఫ్ఘాన్ క్రికెటర్లు నూర్ అహ్మద్, నవీన్ ఉల్​హక్​ వంటి కీలక ఆటగాళ్లు కూడా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. స్టార్లు లేక టీమ్స్ బోసిపోవడంతో పీఎస్​ఎల్​ను పట్టించుకునేవారు కరువయ్యారని తెలుస్తోంది. ఆ లీగ్ పనైపోయిందని.. పాక్ బోర్డు ఇక దుకాణం మూసుకోవాల్సిందేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇతర లీగ్స్ జరుగుతున్న టైమ్​లో కాకుండా వేరే తేదీల్లో పీఎస్​ఎల్​ను నిర్వహించాలని పీసీబీని ఫ్రాంచైజీల యజమానులు కోరారు. ఫారెన్ ప్లేయర్స్ లేకపోతే ఉన్న ఆదరణ కూడా తగ్గిపోతుందని వాపోయారు. ఇలాగే కొనసాగితే పీఎస్​ఎల్ నెక్స్ట్ సీజన్ జరగడం కూడా అనుమానమేనని అంటున్నారు. మరి.. పీఎస్​ఎల్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇషాన్ కిషన్ VS రాహుల్ ద్రావిడ్! గట్టి వార్నింగ్ తో ఓ మెయిల్ వెళ్లిందట!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి