iDreamPost

మతపెద్దల ఒత్తిడికి తలొగ్గి మసీదులలో ప్రార్థనలకు అనుమతిచ్చిన పాకిస్తాన్

మతపెద్దల ఒత్తిడికి తలొగ్గి మసీదులలో ప్రార్థనలకు అనుమతిచ్చిన పాకిస్తాన్

కరోనా కోరలలో చిక్కుకొని ప్రపంచమంతా విలవిలలాడుతున్న వేళ మరో నాలుగు రోజులలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ మాసంలో ముస్లింలు మసీదులలో రోజుకు 5 సార్లు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.రంజాన్ మాసంలో నెల రోజులు పాటు ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు.నెల రోజులూ ఇఫ్తార్ విందులు జరుగుతాయి.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ మాసంలో మసీదులలో నిర్వహించే సామూహిక ప్రార్థనలను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. కానీ తాజాగా పాక్ ప్రభుత్వం ఇస్లాం మత సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి కొన్ని షరతులతో సామూహిక ప్రార్థనలకు అనుమతిచ్చింది.

పాక్ ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు మసీదులలో నమాజు చేసే ప్రాంతాలను వైరస్ క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయడం,వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించేలా చూడడం వంటి నియమాలను కచ్చితంగా అమలు పరుస్తామని మత పెద్దలు ప్రకటించారు.ఇక ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, కరచాలనాలు చెయ్యడంపై మాత్రం పూర్తి నిషేధం విధించారు.అలాగే 50 ఏళ్ళ వయసు నిండిన వారు,పిల్లలు,ఫ్లూ లక్షణాలతో బాధపడే వారిని మసీదులలోకి అనుమతించరాదని ప్రభుత్వం విధించిన నిబంధనకు ఇస్లాం మత పెద్దలు అంగీకరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి