iDreamPost

12 ఏళ్లు సాగిన సిరీస్.. Netflixలోనే ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది!

Netflix OTT Suggestions: నెట్ ఫ్లిక్స్ లో ఎన్నో సిరీస్లు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయి. అలాంటి వాటిలో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. దాదాపు 12 ఏళ్లు కొనసాగిన ఈ సిరీస్ ని చాలా మంది లైట్ తీసుకున్నారు.

Netflix OTT Suggestions: నెట్ ఫ్లిక్స్ లో ఎన్నో సిరీస్లు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయి. అలాంటి వాటిలో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. దాదాపు 12 ఏళ్లు కొనసాగిన ఈ సిరీస్ ని చాలా మంది లైట్ తీసుకున్నారు.

12 ఏళ్లు సాగిన సిరీస్.. Netflixలోనే ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది!

ఓటీటీల్లో ఒక్కో సిరీస్ చూస్తే భలే ఆనందం వేస్తుంది. ఒక్కో సిరీస్ చూస్తే కాస్త నీరసం వస్తుంది. కానీ, ఒక్కో సిరీస్ మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దుప్పటి కప్పుకుని, సౌండ్ తగ్గించుకుని, సగం కళ్లు మూసుకున్నా చూడటం మాత్రం ఆపలేరు. అలాంటి సిరీస్లు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక సిరీస్ గురించే మీకు చెప్పబోతున్నాం. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ మీలో ఆసక్తిని రెట్టింపు చేస్తుంటుంది. ఒక్కో సీన్ మీకు అసలైన థ్రిల్ అంటే ఏంటో చూపిస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మైండ్ ఏమో ఆపేయమని చెప్తుంటుంది. కానీ, మనసు మాత్రం చూడాల్సిందే అంటూ ఫోర్స్ చేస్తుంది.

ఈ రేంజ్ హైప్ ఇస్తున్నాం అంటే ఆ సిరీస్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇంత హైప్ ఇస్తోంది. వాకింగ్ డెడ్ అనే టీవీ సిరీస్ గురించి. ఈ టీవీ సిరీస్ 2010 అక్టోబర్ 31న టీవీలో ప్రసారం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిన వాకింగ్ డెడ్ అనే టీవీ సిరీస్ ఆగస్టు 22, 2021 వరకు కొనసాగింది. అయితే ఈ వరల్డ్ వైడ్ మోస్ట్ వాంటెడ్ కంటెట్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. మొత్తం 11 సీజన్స్ నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ 11 సీజన్స్ కి కలిపి మొత్తం 177 ఎపిసోడ్స్ ఉన్నాయి. 6 ఎపిసోడ్స్ తో స్టార్ట్ అయిన సిరీస్ ఆఖరి సీజన్ లో 24 ఎపిసోడ్స్ ఉన్నాయి.

ఈ సిరీస్ కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ చూసిన తర్వాత దీనిని ఫ్రాంచైజ్ గా వరుస సినిమాలు కూడా తీశారు. ఈ సిరీస్ మొత్తం జాంబీల నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాలీవుడ్ లో వచ్చే సినిమాలు, సిరీస్లు ఎంతో గ్రాండ్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు. ఆ గ్రాండ్ నెస్ అనేది ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ఈ సిరీస్ లో ముఖ్యంగా జాంబీలకు వేసే మేకప్, డెడ్ బాడీస్ ని చూపించే తీరు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కొన్ని సీన్స్ కి మినీ హార్ట్ అటాక్ కూడా వస్తుంది.

కథ ఏంటంటే?

కింగ్ కౌంటీ జార్జియాలో ఒక డిప్యూటీ షెరిఫ్ రిక్ గ్రిమ్ పై దుండగుడు కాల్పులు జరుపుతాడు. ఆ సమయంలో అతను కోమాలోకి వెళ్లిపోతాడు. అతను కోమా నుంచి కోలుకున్న తర్వాత ప్రపంచం మొత్తం దాదాపు అంతమైపోయిన పనవుతుంది. ఎక్కడ చూసినా డెడ్ బాడీలే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా వాకర్స్(జాంబీలు) ఉంటారు. అందరిలో చాలా కొద్ది మంది మాత్రమే బతికి ఉంటారు. అయితే ఎట్టకేలకు రిక్ గ్రిమ్ కు కంపెనీ దొరుకుతుంది. అలాగే తన భార్య, కొడుకు బతికే ఉన్నాడని అతను బలంగా నమ్ముతాడు. వారి కోసం వెతుకులాట మొదలు పెడతాడు.

అలాగే అట్లాంటాలో ఉండే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు వెళ్లాలి అనుకుంటారు. అక్కడ ఈ వ్యాధికి విరుగుడు ఉంటుంది అని నమ్ముతారు. అయితే అట్లాంటాకి వెళ్లడం అంత తేలిక కాదు. దారి పొడవునా జాంబీలను దాటుకుంటూ.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తారు. అయితే అక్కడి దాకా వెళ్లినా ఈ వ్యాధికి క్యూర్ లేదనే విషయం తెలియడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. అలా ఒక్కో సీజన్ ఈ కథ నేపథ్యంలోనే జరుగుతూ ఉంటుంది. నిజానికి మొదటి సీజన్ కు ఆఖరి సీజన్ కు అస్సలు పోలిక ఉండదు. ఎక్కడ స్టార్ట్ అయిన సిరీస్ ఎక్కడికో వెళ్తుంది. ప్రతి ఎపిసోడ్, ప్రతి సీజన్ ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరి.. ఈ వాకింగ్ డెడ్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి