iDreamPost

OTTలో వింత జీవులు- అతీత శక్తులతో పోరాటం.. ఉత్కంఠకు ఊపిరాగిపోతుంది..

Netflix OTT Suggestions: వెబ్ సిరీస్ లు ఇష్టపడే వాళ్లు.. అందులోనూ యాక్షన్ సిరీస్ లు కోరుకునే వాళ్లు ఈ సిరీస్ ని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇది బెస్ట్ ఫాంటసీ హారర్ యాక్షన్ థ్రిల్లర్. చూడకపోతే ఇన్నాళ్లు మంచి సిరీస్ మిస్ అయినట్లే..

Netflix OTT Suggestions: వెబ్ సిరీస్ లు ఇష్టపడే వాళ్లు.. అందులోనూ యాక్షన్ సిరీస్ లు కోరుకునే వాళ్లు ఈ సిరీస్ ని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇది బెస్ట్ ఫాంటసీ హారర్ యాక్షన్ థ్రిల్లర్. చూడకపోతే ఇన్నాళ్లు మంచి సిరీస్ మిస్ అయినట్లే..

OTTలో వింత జీవులు- అతీత శక్తులతో పోరాటం.. ఉత్కంఠకు ఊపిరాగిపోతుంది..

వెబ్ సిరీస్ అంటే అలా ఇలా ఉండకూడదు. ఒక్కో ఎపిసోడ్ కి, ఒక్కో సీన్ కి నరాలు తెగిపోయాల ఉండాలి. అలాంటి సిరీస్లు చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ కు వెబ్ సిరీస్ అంటే అలా ఇలా ఉండకూడదు. మరి.. అలాంటి సిరీస్లు లేవా అంటే? ఓటీటీలో అందుబాటులోనే ఉన్నాయి. కానీ, చాలామందికి అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయమే తెలియడం లేదు. అందుకే ఓటీటీ సజీషన్స్ రూపంలో మేము అలాంటి అద్భుతమైన వెబ్ సిరీస్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది కూడా నరాలు తెగే ఉత్కంఠతో ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ థ్రిల్ ని నెక్ట్స్ స్టేజ్ కి తీసుకెళ్తుంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

ఇంత హైప్ ఇస్తున్నారు.. సిరీస్ లో విషయం ఉంటుందా? అనే కంగారు పడకండి. ఐఎండీబీలో ఈ సిరీస్ కి 8.0/10 రేటింగ్ ఉంది. 5.67 లక్షల మంది ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ ఇది. ఈ సిరీస్ మరేదో కాదు.. ది విట్చర్. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే 3 సీజన్స్ అందుబాటులో ఉన్నాయి. 2019లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ ది విట్చర్ సిరీస్ కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 2019లో మొదటి సీజన్, 2021లో రెండో సీజన్, 2023లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. త్వరలోనే నాలుగో సీజన్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

The Witcher

ఈ మూడు సీజన్స్ కలిపి ఇందులో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నుంచి గంట వరకు నిడివి కలిగి ఉంటుంది. ఈ విట్చర్ సిరీస్ కి వరల్డ్ వైడ్ గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ ఏ హాలీవుడ్ యాక్షన్ సినిమాకి తీసిపోకుండా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ టేకింగ్ చూస్తే.. హాలీవుడ్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కూడా దీని ముందు దిగదుడుపనే చెప్తారు. ఈ సిరీస్ ది విట్చర్ అనే పుస్తకం ఆధారంగా నిర్మించింది. ఇది ఒక ఫాంటసీ హారర్ యాక్షన్ డ్రామా. హెన్రీ కావిల్ ఈ సిరీస్ లో గెరాల్ట్ గా లీడ్ రోల్ ప్లే చేశాడు. అతను ఒక సూపర్ న్యాచురల్ స్పిరిట్స్ ని వేటాడే మాన్ స్టర్ హంటర్. అతడిని అందరూ విట్చర్ అంటారు.

విట్చర్ కి కొన్ని శక్తులు ఉంటాయి. వాటిని మేల్కొలిపి ఈ మోన్ స్టర్స్ ని వేటాడుతూ ఉంటాడు. అతనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం కోసం పోరాడుతూ ఉంటాడు. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో అతనికి ఎదురయ్యే ఆటంకాలు.. ప్రజలను వేధిస్తున్న రాకాసులను వేటాడుతూ ఉంటాడు. అతనికి ఎన్నెఫెర్ అనే మంత్రగత్తె కూడా తోడుగా నిలుస్తుంది. వీళ్లంతా కలిసి సింట్రాన్ యువరాణి సిరి అతని డెస్టినీ. ఈ సిరీస్ లో కాస్త అప్పుడప్పుడు బోల్డ్ సీన్స్ వస్తాయి. పిల్లలో చూసేందుకు మాత్రం ప్లాన్ చేసుకోకండి. అతను తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడా? ఆ యువరాణిని రక్షించగలిగాడా? అతనికి ఎదురయ్యే అవాంతరాలు ఏంటి? అసలు విట్చర్ కథేంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలి అంటే మీరు నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ది విట్చర్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. మరి.. ఈ ది విట్చర్ సిరీస్ ఇప్పటికే చూసుంటే.. మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి