iDreamPost

ఓవైపు డ్యూటీ.. మరోవైపు కన్న తండ్రి.. OTTలో ఈ పోరాటం చూడాల్సిందే!

Best Action Drama OTT Suggestions: ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, స్టార్ట్ చేస్తే ఆపకూడదు అనిపించేవి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అయితే ఉంటుంది.

Best Action Drama OTT Suggestions: ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు ఉంటాయి. కానీ, స్టార్ట్ చేస్తే ఆపకూడదు అనిపించేవి చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అయితే ఉంటుంది.

ఓవైపు డ్యూటీ.. మరోవైపు కన్న తండ్రి.. OTTలో ఈ పోరాటం చూడాల్సిందే!

ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసే వారికి ఒక వీక్ నెస్ ఉంటుంది. ఒక సిరీస్ పూర్తయ్యాక ఇంకో వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాల్సిందే. అయితే వెబ్ సిరీస్ చూడటానికి సెలక్ట్ చేసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. అది ఎలా ఉంటుంది? ఎంజాయ్ చేయచ్చా? సస్పెన్స్, థ్రిల్, డ్రామా ఆకట్టుకుంటాయా? స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అనే భయాలు ఉంటాయి. అలాగే కొందరు ట్రైలర్స్ చూసి సిరీస్ స్టార్ట్ చేస్తారు. ఇంకొందరు ఐఎండీబీ రేటింగ్ చూసి చూడటం మొదలు పెడతారు. మీకు అంత కష్టం లేకుండా మేము మీకోసం ఒక అద్భుతమైన సిరీస్ తీసుకొచ్చాం. అది చూడటం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమనే చెప్పాలి. మరి.. ఆ సిరీస్ ఏది? అది ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకునే సిరీస్ పేరు గ్రహణ్. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 2021 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీ రేటింగ్ కూడా 8.3గా ఉంది. అంటే ఏ రేంజ్ డ్రామా, యాక్షన్, సస్పెన్స్ ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ వెబ్ సిరీస్ ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఉదాహరణగా చెప్తూ.. దాని చుట్టూ ఒక యాక్షన్ డ్రామాని క్రియేట్ చేశారు. ఈ గ్రహణ్ వెబ్ సిరీస్ ని సత్య వ్యాస్ రాసిన చౌరాసి అనే పుస్తకం ఆధారంగా నిర్మించారు. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ డ్యూరేషన్ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సిరీస్ ని ఎక్కడా బోర్ కొట్టకుండా.. దృష్టి మరలకుండా ఎంతో ఎంగేజింగ్ గా డైరెక్టర్ రంజన్ చండేల్ తెరకెక్కించాడు.

ఈ స్టోరీని మొత్తం రంజన్ చండేల్ సహా ఆరుగురు రైటర్స్ రాశారు. దీనికోసం ఎంతో రీసెర్చ్ కూడా చేశారు. అలాగే 1984నాటి పరిస్థితులు, అప్పటి భాష, యాస, వస్త్రధారణను కూడా చూపించారు. నిజానికి ఇది సిక్స్ అల్లర్లు నేపథ్యంలో తెరకెక్కించిన వెబ్ సిరీస్. కానీ, హాట్ స్టార్ లో మొత్తం 7 భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా మీరు ఈ సిరీస్ ని చూసేయచ్చు. అసలు అంత కట్టిపడేసే కథ ఏం చెప్పారు అనే పాయింట్ లో కూడా మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసేయచ్చు. అంతేకాకుండా ఇందులో ఒక గెప్ప లవ్ స్టోరీ ఉంది. అలాగే తండ్రి- కూతుళ్ల పోరాటం ఉంటుంది. డ్యూటీ- కన్నప్రేమ మధ్య సంఘర్షణ ఉంటుంది. మొత్తంగా మీరు ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్, లవ్, రివేంజ్, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని కోణాల్లో ఈ వెబ్ సిరీస్ ని ఎంజాయ్ చేయగలుగుతారు.

కథ ఏంటంటే?:

అమృత సింగ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. అయితే తనకు ఒక కేసు గురించి తెలుస్తుంది. ఆ కేసులో తన తండ్రి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుసుకుటుంది. తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అసలు నిజాలను వెలికితీయాలి అని భావిస్తుంది. తవ్వుతున్న కొద్దీ తన తండ్రి చుట్టూనే అసలు క్రైమ్ జరిగిందనే విషయాన్ని గ్రహిస్తుంది. అలాగే 1984లో తన తండ్రి ప్రేమకథను కూడా తెలుసుకుంటుంది. అయితే తన తండ్రి అసలు సిక్కు కూడా కాదనే విషయం తేటతెల్లమవుతుంది. అసలు హీరోయిన్ తండ్రి ప్రేమకథ ఏంటి? తను అసలు సిక్కు అని ఎందుకు నాటకం ఆడుతున్నాడు? 1984నాటి అల్లర్లు 2016లో మరోసారి ఎందుకు తెరమీదకు వచ్చాయి? అమృత సింగ్ అసలు ఈ కేసును ఛేదించిందా? తండ్రికి శిక్ష పడేలా చేసిందా? అనేదే ఈ గ్రహణ్ వెబ్ సిరీస్ అసలు కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి